- Advertisement -spot_img
HomeUncategorized"మార్కెట్ మహాలక్ష్మి" 1st సాంగ్ రివ్యూ!

“మార్కెట్ మహాలక్ష్మి” 1st సాంగ్ రివ్యూ!

- Advertisement -spot_img

కేరింత ఫేమ్ “పార్వతీశం” హీరోగా V.S.ముకేశ్ అనే ఒక యువ దర్శకుడి తో “మార్కెట్ మహాలక్ష్మి” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంభందించిన టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేసారు. టీజర్ కి గాను మంచి స్పందన వచ్చింది. ఐతే ఈ సినిమాకి సంభందించిన మరో కీలక అప్డేట్ 1ST సాంగ్ రూపం లో ఈరోజు రిలీజ్ చేసారు. “సాఫ్ట్వేర్ పోరగా అవసరమేనా నీకు ఈ పిల్ల” అంటూ సాగే ఈ పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటలో ని లిరిక్స్ సినిమా యొక్క కధను ప్రతిబింబిచేలా ఉన్నాయి. software engineer మార్కెట్ లోని కూరగాయలు అమ్ముకునే అమ్మాయి మీద మనసు పారేసుకుంటాడు. తన కోసం అదే మార్కెట్ లోకి షిఫ్ట్ అవుతాడు. అక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉంటాడు. సేమ్ ఈ ప్రక్రియనే పాటలో లోని సాహిత్యం రూపంలో పెట్టారు. ఈ మధ్యకాలం లోని తెలుగు సినిమా పాటలు అర్థంపర్థంలేకుండా వస్తున్న తరుణంలో ఈ పాట మాత్రం కొంచం కొత్తగా, అర్థవంతంగా ఉంది. అందుకాను ఈ పాట యొక్క లిరిక్స్ రైటర్ కి హాట్స్ ఆఫ్. ఈ పాట యొక్క లిరిక్స్ రైటర్, దర్శకుడు ఇద్దరు ఒకరే అవ్వడం విశేషం. ఈ సాంగ్ తో సినిమా మీద కొంచం పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. సినిమా చూడాలన్న ఆత్రుత ఏర్పడింది. పార్వతీశం కి ఈ సినిమాతో మంచి విజయం తధాస్తు లాగానే కనిపిస్తుంది. తొలి సినిమానే అయినా నిర్మాత “అఖిలేష్ కలరు” గారు ఏంటో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page