శతమానం భవతి, శ్రీకారం, ఆడాళ్ళు మీకు జోహార్లు వంటి సినిమాలతో మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపుతెచ్చుకున్న శర్వానంద్. ఈ మార్చి 6 అనే రోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుంది. దానికి కారణం ఒకటి మార్చి6 తన పుట్టినరోజు కాగా ఇంకొకటి తన పాపకి నామకరణం చేసిన రోజు. అవును ఇటీవలే శర్వానంద్ భార్య “రక్షిత రెడ్డి” పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఐతే ఈ విషయాన్ని శర్వానంద్ ఎక్కడా అధికారంగా ప్రకటించలేదు. దీంతో ఈ విషయం అంతగా వెలుగులోకి రాలేదు. మార్చి 6 శర్వానంద్ తన పుట్టినరోజు సందర్భంగా తనకి పాప పుట్టిన విషయాన్నీ అధికారంగా ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అంతే కాకుండా తన పాప కి “లీలా దేవి” అని అచ్చ తెలుగు పేరును నామకరణం చేసాడు. ప్రస్తుతం తన పాప,భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. జీవితంలో ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్న కాని ఈ పుట్టినరోజు మాత్రం చాలా ప్రత్యేకం అంటూ తన అనుభూతిని పంచుకున్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు శర్వానంద్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పాప చాలా ముద్దుగా ఉందంటూ శర్వానంద్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.