వరుస పరాజయాలకు చెక్ పెట్టి ఇటీవలే “ఊరి పేరు భైరవకోన” సినిమాతో మంచి విజయం అందుకున్నాడు సందీప్ కిషన్. ప్రస్తుతం ఈ సినిమా సకెస్స్ ను ఎంజాయ్ చేస్తున్న సందీవ్ కిషన్, తన తదుపరి సినిమా పై అప్పుడే ద్రుష్టి సారించాడు. “ధమాకా” సినిమాతో 100కోట్ల మార్క్ అందుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా కంఫర్మ్ చేసాడు. ధమాకా సినిమాకి కధ అందించిన బెజవాడ ప్రసన్న కుమార్ ఈ సినిమాకి కూడా కథ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని A.K . ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. చూద్దాం మరి లేక లేక వచ్చిన సకెస్స్ ని ఈ సినిమా తో కూడా కంటిన్యూ చేస్తాడేమో.