“కేరింత” పార్వతీశం కథానాయకుడిగా, ప్రవీకాన్విక నాయికగా VS ముఖేష్ రచించి దర్శకత్వం వహిస్తున్న చిత్రం “మార్కెట్ మహాలక్ష్మి”. అఖిలేష్ కలరు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి Joe Emnav సంగీతం అందిస్తున్నారు, సురేంద్ర చిలుముల సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యి అందరినీ అలరిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం యొక్క ట్రైలర్ విషయాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం. Software ఉద్యోగం చేసుకునే కుర్రాడికి తన తండ్రి ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా కాదని, కూరగాయల మార్కెట్ లో ఉండే మహాలక్ష్మి ని ప్రేమిస్తాడు. అక్కడనుంచి తన జీవితం మారిపోతుంది. ఎంతో మంది ఎక్కువ కట్నం ఇస్తాను అన్నాసరే మహాలక్ష్మి నీ కోరుకుంటాడు. మహాలక్ష్మి ఒక గడుసు పిల్ల. ఎప్పుడు తన ప్రేమని చెప్పినా కూడా ఒప్పుకోకుండా మన హీరో ని కొడుతూ, తిడుతూ ఉంటుంది. ఇలాంటి విచిత్రమైన ప్రేమ ఎన్ని గొడవలకి దారి తీసింది, చివరికి తన ప్రేమని మన Software పోరగాడు గెలిపించుకున్నాడా అనేది కథ. కథ పరంగా కొంచం కొత్తగా ఉన్నప్పటికీ, కామెడీ సన్నివేశాలు మంచిగా పేలితే గొప్ప విజయం దక్కించుకుంటుంది ఈ చిత్రం. పార్వతీశం పాత్ర కొంచం నెమ్మదస్తుడిలా చూపించారు, ప్రవీకాన్విక పాత్ర గడుసు పిల్లగా చూపించారు. ఇలాంటి వైవిధ్యమైన జంట ఎలా కలిసింది అని చూపించటం కొంచం కత్తిమీద సాను లాంటిదే. Joe Emnav సంగీతం పరవాలేదు అనిపించేలా ఉంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ముఖేష్ గారు తన సత్తాని కథనంలో ఎలా చూపించారో విడుదల అయ్యాక తెలుసుకోవాలి.