- Advertisement -spot_img
HomeUncategorizedమహేష్-రాజమౌళి ఓ ఉగాది : Movie update on Ugadi

మహేష్-రాజమౌళి ఓ ఉగాది : Movie update on Ugadi

- Advertisement -spot_img

ఇది టాలీవుడ్ కే బ్రేకింగ్ న్యూస్, బాలీవుడ్ కి షాకింగ్ న్యూస్, టోటల్ ఇండియన్ సినిమాకే ఇది సెన్సేషనల్ న్యూస్. ఇండియన్ సినిమా అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న మహేష్-రాజమౌళి సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ రానే వచ్చింది. ఇప్పటికే ఎన్నో అసాధ్యమైన సినిమాలు తీసి మొత్తం వరల్డ్ సినిమాస్ నే అట్ట్రాక్ట్ చేసిన దర్శక ధీరుడు. మరోసారి ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టడానికి రెడీ అయిపోయాడు. ఈసారి మహేష్ బాబు లాంటి హాలీవుడ్ కటౌట్ ని పెట్టుకొని ప్రపంచ దండయాత్రకు బయలుదేరడానికి సిద్దమయ్యాడు. అందుకు ముహూర్తం ఏప్రిల్ 9 ఉగాది పండుగగా ఖరారు చేసుకున్నారు. అవును ఆర్. ఆర్. ఆర్ తర్వాత మహేష్ బాబు తో రాజమౌళి తన తదుపరి సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే. రాజమౌళి తాను చేయబోయే తదుపరి సినిమా ఏదయినా సరే ఆ సినిమాకి సంబందించిన కధ, అందులో హీరో క్యారెక్టరైజెషన్ గురించి చిన్న ప్రెస్మీట్ పెట్టి ఆడియన్స్ ని ముందే ప్రిపేర్ చేస్తారు. ఆర్. ఆర్. ఆర్, బాహుబలి,ఈగ లాంటి సినిమాలు షూటింగ్ కి ముందే కథ రివీల్ చేసి ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచారు. మహేష్ బాబు సినిమాకి కూడా అలానే చేయబోతున్నారు. ఏప్రిల్ 9 ఉగాది పండుగ సందర్భంగా రాజమౌళి తన చిత్ర యూనిట్ తో కలిసి ప్రెసుమీత్ ఏరెంజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం లో రాజమౌళి- మహేష్ బాబు తో పాటు నిర్మాత కె. ఎల్. నారాయణ మరికొంతమంది పాల్గొనబోతున్నారు. ఐతే ఈ న్యూస్ పై చిత్ర యూనిట ఇంకా అధికారంగా ప్రకటించకపోయినప్పటికీ, ప్రస్తుతం ఈ వార్త అయితే ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. మరి ఇది ఎంత నిజమో తెలియాలంటే మరికొద్దిరోజులుపాటు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page