- Advertisement -spot_img
HomeUncategorizedగ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 17 విడుదల!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 17 విడుదల!

- Advertisement -spot_img

ఇటీవలే “గామి” చిత్రంతో మంచి విజయం అందుకున్న విశ్వక్ సేన్, ఈసారి “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య అనే ఓ లిరిక్ రైటర్ డైరెక్షన్ లో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే సినిమా చేస్తున్నాడు. ఇన్నాళ్లు తెలుగులో సక్సస్ ఫుల్ లిరిక్స్ రైటర్ గా పని చేసిన కృష్ణ చైతన్య తొలిసారి ఈ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టాడు. నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మే 17వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు విశ్వక్ సేన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించారు. తొలుత ఈ చిత్రాన్ని మార్చి 8న రిలీజ్ చేయాలని భావించారు. కానీ పలుకారణాల వల్ల ఈ సినిమా మార్చి 8 నుంచి వాయిదా పడి ఫైనల్ గా మే 17న రాబోతుంది. ప్రముఖ కధానాయిక అంజలి ఈ సినిమాలో ఓ ముఖ్యమైన రోల్ పోషిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నాగ వంశి- సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటర్టైన్మెంట్స్-ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో నిర్మిస్తున్నారు. మరి చూద్దాం “గామి” సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో కూడా మరో విజయం అందుకొని సక్సస్ ట్రాక్ ను కొనసాగిస్తాడో లేదో.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page