పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో ఆలసిపోయినట్లున్నాడు. అందుకే కొంచం రిలాక్సేషన్ కోసం మారుతి లాంటి డైరెక్టర్ తో జతకట్టాడు. ప్రభాస్ హీరోగా మినిమం గ్యారంటీ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మొదట ఈ చిత్రానికి రాజాడీలక్స్ అనే టైటిల్ అనుకున్నారు తర్వాత మాత్రం దాన్ని రాజాసాబ్ గా మార్చారు. ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ప్రభాస్ ఫస్ట్ లుక్ గడిచిన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. గళ్ళ లుంగీ లో ఉన్న ప్రభాస్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ సినిమా రిలీజ్ డేట్ 2025 సంక్రాంతి కి వస్తుంది అని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలూ ఎటువంటి నిజం లేదు అంటూ చిత్రయూనిట్ ఖండించింది. ఐతే అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తలే నిజమైయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్రయూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం వచ్చే సంక్రాంతి వైపే మొగ్గుచూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ వల్ల షూటింగ్ డిలే అవ్వడం. పైగా చక చక సినిమాలు తీసే మారుతి సైతం ఫస్ట్ టైం ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమా కి ప్రతి చిన్న విషయాన్ని ఆచి తూచి అడుగులేసస్తుండడం తో షూటింగ్ ఇంకాస్త డిలే అయ్యే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. దింతో ఆగష్టు నాటికి పూర్తవుతుందనుకున్న షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలుస్తుంది. ఇంకేలాగు డిసెంబర్ కాబట్టి నిర్మాతలు సంక్రాంతి కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సంక్రాంతి అంతే తెలుగు వారికి పెద్ద పండగ కాబట్టి పైగా సినిమా వాళ్ళకి కి కూడా సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండుగ. ప్లాప్ టాక్ వచ్చిన సినిమాలు కూడా ఈ సీజన్లో గట్టెక్కాయి. వరుసగా పది రోజుల పాటు తిరుగుండకపోవడం. పైగా ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ కి క్యూ కడతారు కాబట్టి నిర్మాతలు ఇదే మంచి నిర్ణయం అని భావిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ “విశ్వంభర” కూడా వచ్చే సంక్రాంతికే వస్తున్నట్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ “రాజాసాబ్” కూడా వస్తే బాక్సాఫీస్ దగ్గర మెగా ఫాన్స్ వర్సెస్ రెబల్ ఫాన్స్ మధ్య వార్ నడవడం ఖాయం