- Advertisement -spot_img
HomeUncategorizedపవర్ స్టార్ ఫాన్స్ కు బ్రేకింగ్ న్యూస్!

పవర్ స్టార్ ఫాన్స్ కు బ్రేకింగ్ న్యూస్!

- Advertisement -spot_img

ఎలక్షన్స్ హీట్ తో ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద పూర్తి ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. అందుకే ఒక్క OG సినిమా మినహాయించి మిగిలిన సినిమాల షూటింగ్స్ అన్ని ప్రెసెంట్ పోస్టుపోన్ చేసుకున్నారు. హరీష్ శంకర్ సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా ఐతే నవంబర్ నుంచే షూటింగ్లో పాల్గొనడం మానేశారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పూర్తయ్యేదాకా “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్లో పాల్గొనను అని చెప్పేయడంతో, హరీష్ శంకర్ ఈ సినిమాను హోల్డ్ లో ఉంచేసి రవితేజ తో మిస్టర్. బచ్చన్ అనే సినిమా స్టార్ట్ చేసాడు. ఐతే అందుతున్న సమాచారం ప్రకారం “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ బయటకి రానున్నట్లు తెలుస్తోంది. మార్చి19న “ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి అదిరిపోయే పవర్ఫుల్ glimpse బయటకి రాబోతుంది. ఎలక్షన్స్ మూమెంట్ ని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ కోసం హరీష్ శంకర్ కొన్ని అదిరిపోయే పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ రాసినట్టు సమాచారం. గబ్బర్ సింగ్ సినిమాలోని హరీష్ శంకర్ మాస్ డైలాగ్స్ కు ఉర్రూతలూగిపోయిన పవర్ స్టార్ ఫ్యాన్స్, ఈ సినిమాలోని డైలాగ్స్ అందుకు 10రెట్లు ఎక్కువ ఉంటాయి అని టాక్. పవన్ కళ్యాణ్ మూవీస్ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేక డీలా పడ్డ ఫాన్స్ ఈ అప్డేట్ తో ఫుల్ ఖుషి అయ్యారు. మార్చి19న పవన్ కళ్యాణ్ ఫాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page