- Advertisement -spot_img
HomeMoviesతమిళ హీరో సూర్య మోస్ట్ అవైటెడ్ మూవీ "కంగువ" టీజర్ వచ్చేస్తోంది!

తమిళ హీరో సూర్య మోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ” టీజర్ వచ్చేస్తోంది!

- Advertisement -spot_img

పేరుకే తమిళ హీరో అయిన సూర్య చిత్రాలకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గజినీ, సూర్య s/o కృష్ణన్, సింగం సిరీస్ తో పాటు పలు చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత మళ్ళీ అంత ఫ్యాన్ బేస్ ఉంది సూర్యకే. అలాంటి సూర్య సినిమాల మార్కెట్ ఉన్నటుంది తమిళం తో పాటు తెలుగు లో కూడా ఒక్కసారిగా డౌన్ అయిపొయింది. గ్యాంగ్, N.G.K, బందోబస్తు వంటి పలుచిత్రాలతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఘోరా పరాజయం పాలైయ్యాయి. ఈ దెబ్బతో సూర్య సినిమాలు అసలు థియేటర్స్ రావడమే మానేశాయి. ప్రేక్షకులు కూడా సూర్య ను థియేటర్స్ లో చూసి చాలా కాలమైయింది. చివరిగా విక్రమ్ సినిమా వచ్చినప్పటికీ అది సూర్య సినిమా కాదు. అలాంటి సూర్య ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన “శివ” దర్శకత్వంలో “కంగువ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రిందటే “కంగువ” సినిమాకి సంభందించిన glimpse ఒకటి బయటికి వచ్చింది. అందులోని విసువల్ ఎఫెక్ట్స్ కి గాను, ముఖ్యంగా సూర్య లుక్స్ కి గాను విశేష స్పందన వచ్చింది. విభిన్న లుక్స్ తో సూర్య ఆకట్టుకున్నాడు. glimpse లో ఈ జనవరి కి సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసిన పలుకారణాల వాళ్ళ సినిమ వాయిదా పడింది. దింతో ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న ఫాన్స్ కి మరో అప్డేట్ బయటకొచ్చింది. “కంగువ” టీజర్ని ఈరోజు సాయంత్రం 4గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అధికార ప్రకటన వచ్చింది. టీజర్లో సినిమా రిలీజ్ డేట్ బయటకొచ్చే అవకాశము లేకపోలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page