- Advertisement -spot_img
HomeMoviesసెట్స్ పైకి రానున్న దసరా-2!

సెట్స్ పైకి రానున్న దసరా-2!

- Advertisement -spot_img

న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో నే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం దసరా. గతేడాది సమ్మర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్స్ కుమ్మేసింది. దాదాపు 65కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి నాని కెరీర్లో నే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడులో ఒకడైన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. 1990 కాలం నాటి పల్లెటూర్లో జరిగే కులాల మధ్య గొడవలు , రాజకీయ గొడవలను చాలా సహజంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. వీరపల్లి లో అనే గ్రామంలో ఉండే సూరి, ధరణి, వెన్నెల ఈ ముగ్గురి స్నేహితుల కథే ఈ సినిమా కథ. మామూలుగానే న్యాచురల్ యాక్టింగ్ తో అలరించే నాని. ఈ సినిమాలో ధరణి పాత్రలో అదరకొట్టాడు. కీర్తిసురేష్ సైతం తన కెరీర్లోనే తొలిసారి డీ గ్లామరస్ రోల్లో అలరించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, మరోసారి మన ముందుకు రాబోతోంది, కానీ ఈ సారి సీక్వెల్ రూపంలో రాబోతుంది. 1st పార్ట్ మంచి విజయం సాధించడంతో దసరా-2 సైతం తీసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం “సరిపోదా శనివారం” షూటింగ్ లో బిజీగా ఉన్న నాని అది అవ్వగానే దసరా-2 లో జాయిన్ అవుతారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ద్వితీయార్ధమే దసరా-2 సెట్స్ పైకి వెళ్తుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page