- Advertisement -spot_img
HomeMoviesహ్యాపీ బర్త్ డే Mr. మగధీర!

హ్యాపీ బర్త్ డే Mr. మగధీర!

- Advertisement -spot_img

మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ఉప్పెన ఒక ప్రవాహం. ఇంక ఆయన తమ్ముడు పవర్ స్టార్ ఇంకో సంచలనం. ఆయనో పవర్ హౌస్ ఒక స్పెషల్ ప్యాకేజ్. ఇంక వీళ్లిద్దరి కలయికే మెగా పవర్ స్టార్. మెగా స్టార్ లోని డాన్స్ , పవర్ స్టార్ లోని ఫైర్ ఈ రెండు కలగలిపి ఉన్నాడు కాబట్టే అతను మెగా పవర్ స్టార్ అయ్యాడు. మెగాస్టార్ వారసుడు హీరో అవుతున్నాడు అనే వార్త రాగానే, చాలామంది కి వచ్చిన మొదటి సందేహం మెగాస్టార్ వారసత్వాన్ని నిలుపుతాడా. ఎందుకంటే ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లు తెలుగు ఇండస్ట్రీ ని ఏలుతున్న టైంలో మెగాస్టార్ ఒక సునామీలాగ వచ్చి no.1 గా ఎదిగాడు. ఆ తర్వాత వాళ్ళ వారసులు బాలకృష్ణ, నాగార్జున లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఎవరూ మెగాస్టార్ చిరంజీవి ని బీట్ చేయలేకపోయారు. మరి అలాంటి వ్యక్తి వారసుడు వస్తున్నాడు అంటే సహజంగానే అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టే వాళ్ల అంచనాలని అందుకోవడంలో ఏమాత్రం నిరాశపరచలేదు రామ్ చరణ్. తొలి సినిమా చిరుత తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్. ఆ సినిమాలో నటనలో ఫర్వాలేదు అనిపించుకున్నా డాన్సుల్లో మాత్రం చిరంజీవి వారసుడు అనిపించుకున్నాడు. ఇంక రెండో చిత్రం మగధీర తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఏకంగా తండ్రి నే మించిపోయాడు. తెలుగులో ఫస్ట్ 50కోట్ల షేర్ ఫస్ట్ 100కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమా ఇది. అప్పుడే ఎలక్షన్స్ లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన చిరంజీవి తో పాటూ ఇటూ మెగా ఫాన్స్ కి కూడా ఈ సినిమా గొప్ప ఊరటని ఇచ్చింది. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిందని చిరంజీవిని దారుణంగా విమర్శించిన వాళ్ళందరూ సైతం ఈ సినిమా చూసి మళ్లీ వాళ్లే విమర్శించిన నోర్లతో నే చిరంజీవిని గొప్పగా ప్రశంసించారు. అలా రెండవ చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న హీరోగా ఒక అరుదయిన ఘనత సాధించారు రాంచరణ్.

మగధీర తర్వాత రాంచరణ్ చేయబోయే తర్వాత సినిమాల పై భారీ అంచనాలు వచ్చిపడ్డాయి. ఆ కారణంగానే “ఆరెంజ్” లాంటి సినిమా దారుణంగా దెబ్బతింది. ఈ సినిమాకి వచ్చిన నష్టాలకి నిర్మాత నాగబాబు ఏకంగా ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లాల్సొచ్చింది. మగధీర లాంటి మాస్ సినిమా తర్వాత ఆరెంజ్ లాంటి క్లాస్ సినిమా చేయడమే ఈ సినిమా ఫెయిల్యూర్ కి మెయిన్ రీజన్. కానీ సాంగ్స్ మాత్రం పెద్ద హిట్. ఆరెంజ్ తర్వాత రాంచరణ్ చాలా జగ్రత్తలు తీసుకొని చేసిన సినిమా “రచ్చ”. సినిమా ఫర్వాలేదు అనిపించుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం కుమ్మి వదిలిపెట్టింది. ముఖ్యంగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డు సెట్ చేసి పెట్టింది. అదే సంవత్సరం బాబాయ్ పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్ ” సినిమా పెద్ద హిట్టయింది గాని. లేకపోతె రచ్చ సినిమానే ఆ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది. రచ్చ తర్వాత రాంచరణ్ చేసిన సినిమా నాయక్. 2013 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాలో రాంచరణ్ డాన్సులకి గాను, బ్రహ్మనందం కామెడీకి గానూ మంచి ప్రసంశలు వచ్చాయి. నాయక్ తర్వాత బావ అల్లుఅర్జున్ తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన సినిమా “ఎవడు”. ఎప్పుడో 2013 జూలై కి రావాల్సిన ఈ సినిమా సమైఖ్య ఆంధ్ర ఉద్యమం వల్ల 2014 సంక్రాంతి వచ్చింది.

తెలుగులో ఇప్పటి వరకూ ఎప్పుడు చూడనటువంటి ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం కూడా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా ఫర్వాలేదు అనిపించుకున్నప్పటికీ రాంచరణ్ లుక్స్ కీ, నటనకు పలు విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కృష్ణ వంశీ డైరెక్షన్లో “గోవిందుడు అందరివాడేలే” అనే ఫ్యామిలీ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా రాంచరణ్ కి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన “బ్రుస్ లీ” ఇంకో పెద్ద డిజాస్టర్. అలా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రాంచరణ్ కి “ధ్రువ” సినిమా కొంత ఊరటనిచ్చింది. తమిళ్ సినిమా తని ఒరువన్ కి రీమేక్ గా వచ్చిన ధ్రువ 2016 డిసెంబర్ 9 న వచ్చి మంచి విజయం అందుకుంది. రామ్ చరణ్ లుక్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. నోట్ల రద్దు టైంలోను ఈ సినిమా 50కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసింది. లేకుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు చేస్తూ యాక్టింగ్ పెద్దగా స్కోప్ లేకుండా కేవలం సెట్టిల్డ్ యాక్టింగ్ చేసుకుంటూ వచ్చిన రాంచరణ్. “రంగస్థలం” సినిమాలో తన నట పరాక్రమం చూపించాడు. రాంచరణ్ కి నటన రాదు. మగధీర సినిమా ఏదో రాజమౌళి దయ వల్ల ఆడింది అని అన్న వారందరి నోర్లు ఈ సినిమాతో మూయించాడు. చిట్టిబాబు పాత్రలో చెవిటి వాడిగా తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచాడు. అందుకు తగ్గట్టే ప్రేక్షకులు సైతం చిట్టిబాబు పై కాసుల వర్షం కురిపించారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. రాంచరణ్ కెరీర్ ఎప్పుడు ఒక హిట్- రెండు ఫప్లాపులు అన్నట్టు సాగుతుండేది. ఆ ఆనవాయితీ నే “వినయ విధేయ రామ” సినిమా కొనసాగించింది. రంగస్థలం సినిమాతో ఎంత ప్రశంసలు అందుకున్నాడో “వినయ విధేయ రామ” సినిమాతో అంతే విమర్శలు అందుకున్నాడు. 2019 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. దర్శకుడు బోయపాటి శ్రీను సైతం తానూ తీసుకున్న రెమ్యూనిరేషన్ ని వెనక్కి ఇచ్చేయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ పరాజయ ప్రభావం రాంచరణ్ మీద పెద్దగా పడలేదు అందుకే త్వరగా తేరుకొని తన కెరీర్లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ “ఆర్. ఆర్ . ఆర్” మూవీలో జాయిన్ అయిపోయాడు. కరోనా ఎఫెక్ట్ వాళ్ళ సుమారు మూడేళ్లు తెరక్కెకించారు రాజమౌళి. jr.ఎన్టీఆర్ తో కలిసి అల్లూరి సీతారామరాజు గా స్క్రీన్ పై గర్జించాడు. ఈ సినిమాలో హీరోలిద్దరికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి పడింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు సైతం గెలిచి భారతదేశం అంతట ఔరా అనిపించుకున్నారు మూవీ యూనిట్. ఆర్. ఆర్. ఆర్ తర్వాత ప్రస్తుతం క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా “గేమ్ ఛేంజర్‌” అనే సినిమా చేస్తున్నాడు. మధ్యలో తండ్రి చిరంజీవితో కలిసి “ఆచార్య” అనే సినిమా చేసినప్పటికీ ఆ సినిమా రాంచరణ్,చిరంజీవి కేరీర్లో ఒక బ్లాక్ స్పాట్. రెండేళ్ల క్రితమే స్టార్ట్ అయ్యిన గేమ్ ఛేంజర్‌ ఇంకా షూటింగ్ జరుపుకునే స్థాయిలోనే ఉంది. ఈ 17ఏళ్ళ తన సినీ కెరీర్లో ఎన్నో ఎత్తుఫల్లాలు చూసాడు. ప్రస్తుతం 39వ పుట్టినరోజు జరుపుకున్న రాంచరణ్ కి ఒన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే. రామ్ చరణ్ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని అలాగే మరోన్నో గొప్ప చిత్రాలతో మనల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

రైటర్: ఎం. నవీన్

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page