రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అందాల సీత మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం “ది ఫామిలీ స్టార్”. విజయ్ కి గీతా గోవిందం తో మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురాం ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ పనిచేస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ఇప్పటికే మూడు పాటలు విడుదల చేసిన చిత్ర బృందం, హైప్ పెంచటానికి ఇంటర్వూస్ ఇవ్వటం, హోలీ పండుగ జరుపుకోవటం లాంటివి చాలానే చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన “ఖుషీ” చిత్రం ఆశించిన విజయం అందించకపోవడంతో విజయ్, తనకి మొదటి అద్భుతమైన విజయాన్ని అందించిన డైరెక్టర్ తో మళ్ళీ జతకట్టారు. ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ (గోవర్ధన్) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా, తన ఫామిలీ కోసం ఎక్కడికైనా, ఎంత దూరం అయినా వెళ్లే వ్యక్తిగా చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ తన ఇంటి మెడమీద అద్దెకు ఉండే అమ్మాయి. అలా పరిచయం ప్రేమగా అవ్వటంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలనుంచి తన కుటుంబాన్ని, తన రిలేషన్ ని కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నమే “ది ఫామిలీ స్టార్”. ప్రతీ కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, తనమీద దాదాపుగా కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. అటువంటి పాత్ర చేసారు విజయ్. ఎప్పటిలానే తనదైన శైలిలో క్యారెక్టర్ బేస్డ్ డైలాగ్స్ తో రఫ్ఫాడించే ప్రయత్నం చేసారు. మృణాల్ పాత్ర చూడటానికి చాలా అందంగా చూడముచ్చటగా ఉన్నది. తనది చాలా ముఖ్యమైన పాత్ర లాగా అనిపిస్తోంది. గోపీ సుందర్ ఇచ్చిన సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు అనిపిస్తోంది. నిర్మాణ విలువలు బాగున్నాయి, డైలాగ్స్ పరవాలేదు అనిపించాయి. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. స్క్రీన్ ప్లే ద్వారా దర్శకులు ఎలా తెరకెక్కించారో తెలుసుకోవాలంటే వచ్చే నెల 5వ తేదీ వరుకు వేచిచూడాలి. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. చూడాలి మరి, ఇప్పటికైనా సరైన విజయం, విజయ్ దేవరకొండ కి వరిస్తుందో లేదో . ఈ చిత్రం విజయం సాధిస్తే మృణాల్ ఠాకూర్ కి ముచ్చటగా మూడొవ విజయం తెలుగు ఇండస్ట్రీ లో. ఆల్ ది బెస్ట్ టు “ది ఫామిలీ స్టార్” టీం.