శర్వానంద్ అంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తన సినిమాలు అంత బాగుంటాయి. ఫలితంతో సంబంధం లేకుండా తనదైన శైలిలో దూసుకు పోతూ ఉంటారు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న “మనమే” అనే చిత్రంలో నటిస్తున్నారు. కృతి శెట్టి ఆయన సరసన నటిస్తున్నారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం చేస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసింది. భీమ్లా నాయక్ తరువాత శ్రీరామ్ ఆదిత్య చేస్తున్న చిత్రం ఇది. ఈరోజు ఈ చిత్రం నుంచి ఒక మంచి, అర్థవంతమైన పాట విడుదల అయ్యింది. “ఇక నా మాటే” అంటూ సాగే ఈ పాటని కృష్ణ చైతన్య రచించగా మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ గారు ఆలపించారు. ఈ పాట బహుశా హీరో ఇంట్రొడక్షన్ పాట అయ్యుంటుంది. లిరిక్స్ ప్రకారం పారిస్ లో ఉన్న ఐఫిల్ టవర్ తో లిరిక్స్ మొదలు పెట్టి సింగల్ లైఫ్ గురించి బాగా చెప్పారు ఈ పాటలో. వాహాబ్ గారి గాత్రం, కృష్ణ చైతన్య రాసిన పదాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి ఈ ఈ లిరికల్ వీడియోలో. ఈ పాటలో శర్వానంద్ డాన్స్, గెటప్, డ్రెస్ విభిన్నంగా ఉన్నాయి. ఇదివరకు శర్వానంద్ గారిని ఇలా చూసి ఉండము. డాన్స్ స్టెప్స్ కూడా కొంచం కొత్తగా ఉన్నాయి. యూత్ ని అలరించే పాట అవుతుంది. మొత్తానికి శర్వానంద్ నుంచి ఒక మంచి యూత్ సినిమా రాబోతోంది అంటే ఆతృతగా ఉంది ఎప్పుడు చూస్తామా అని. వేచి చూద్దాం తరువాతి అప్డేట్ ఏమి ఇస్తారో. ఈ మొదటి పాట అయితే మన ప్లే లిస్ట్ లో లూప్ లో తిరగటం పక్కా.