- Advertisement -spot_img
HomeMoviesహరిహర వీర మల్లు టీజర్ అప్డేట్!- Film combat

హరిహర వీర మల్లు టీజర్ అప్డేట్!- Film combat

- Advertisement -spot_img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో “హరిహర వీర మల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో లాక్ డౌన్ ముందే షూటింగ్ ప్రారంభమైన ఇంత వరకు రిలీజ్ కి నోచుకోలేదు. నాలుగేళ్ళ కాలం నుంచి ఎప్పుడొస్తుంది, ఇప్పుడొస్తుంది అంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు కానీ సినిమా మాత్రం రావడం లేదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం. ఎక్కువ వర్కింగ్ డేస్ ఉండడంతో ఈ సినిమా కోసం తన కాల్ షీట్స్ ని సరిగ్గా అజస్ట్ చేయలేకపోతున్నారు. ఈ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన “భీమ్లా నాయక్”, “బ్రో” లాంటి చిత్రాలు రిలీజైపోయాయి . “ఉస్తాద్ భగత్ సింగ్”, “ఓ.జి” లాంటి సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

కానీ ఈ హరి హర వీర మల్లు సినిమా మాత్రం ముందుకి, వెనక్కి కొట్టుమిట్లాడుతుంది. ఇప్పటికి కూడా అసలు ఎంత వరకు షూటింగ్ పూర్తియిందో తెలియదు, ఇంకెంత మిగిలుందో తెలియదు, అసలు ఎప్పుడు రిలీజవుతుందో కూడా తెలియదు. మధ్యలో ఈ సినిమా ఇంకా లేదు ఆగిపోయిందని వార్తలొచ్చిన అందులో నిజం లేదు అని చిత్రయూనిట్ ఖండించింది. అటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ సైతం లైట్ తీసుకునే పరిస్థితికొచ్చారు ఈ సినిమా రాదని. ఇలాంటి క్లిష్ఠ సమయాల్లో ఈ సినిమా నుంచి ఎట్టకేలకు ఇంకో అప్డేట్ వస్తుంది. అదేంటంటే ఈ చిత్ర టీజర్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్లు అధికార ప్రకటన వచ్చింది. ఇదివరకే పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ గా ఒక చిన్న గిలింప్స్ వదిలిన చిత్రయూనిట్. మళ్లీ ఇన్నాళ్లకు టీజర్ వస్తుంది. చూద్దాం మరి టీజర్లో నైనా సరికొత్త రిలీజ్ ప్రకటిస్తారేమో.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page