ఎప్పుడు కూడా చాలా ప్రశాంతమైన చిత్రాలు చిత్రీకరించే దర్శకుడు శేఖర్ కమ్ముల గారు మొదటిసారి ఒక మాస్ యాక్షన్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తమిళ నటుడు ధనుష్ సార్ చిత్రం తరువాత ద్విబాషా చిత్రంగా చేస్తున్న చిత్రం “కుబేర”. కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, ధనుష్ సరసన రష్మిక నటిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రం నుంచి నాగార్జున గారి ఫస్ట్ లుక్ విడుదల చేసారు చిత్ర బృందం. చిత్ర బృందం చెప్పిన దానిప్రకారం ఒక సాధారణ స్థాయి, దాదాపుగా బిచ్చమ్ ఎత్తుకునే ఒక వ్యక్తి అపర కోటీశ్వరుడు అయ్యే క్రమమే ఈ చిత్రం. నాగార్జున గారి ప్రతిభ అందరికీ తెలిసిన విషయమే, ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఈ చిత్రం విజయానికి సహాయపడుతుంది అని చెప్పొచ్చు. ఈ మధ్య నాగార్జున గారు సహాయక పాత్రలు ఎక్కువగా చెయ్యటం చూస్తున్నాం. ఆయన నుంచి వచ్చిన చివరి చిత్రం “నా సామి రంగ” ఒకమేరకు ఆకట్టుకుంది. కానీ ఆయనకి తగ్గ విజయం లభించలేదు. ఈ చిత్రం ద్వారా ఆయనకి విజయం చేకూరుతుంది అనిపించేలా కనిపిస్తోంది. “తన పాత్ర చాలా స్పెషల్ అని, చాలా సెన్సిటివ్ పాత్ర అని చెప్పారు నాగార్జున గారు. చాలా కొత్తగా ఉండబోతోంది అని చెప్పుకొచ్చారు”. ఫస్ట్ లుక్ లో చాలా విభిన్నంగా కనిపించారు నాగార్జున. కోట్లకొద్దీ డబ్బు మూటల మధ్య, వానపడుతుంటే ఆయన కళ్ళలో డబ్బుమీద ఉండే ప్రేమ, వ్యామోహం కనిపించాయి. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా ఆకట్టుకుంది. ఫ్రేమింగ్, లైటింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ LLP , ఏషియన్ గ్రూప్స్, అమిగోస్ క్రియేషన్స్ PVT LTD సంయక్తంగా నిర్మిస్తున్నారు.