రోజు రాత్రి 8 అయితే చాలు దివ్యవతి అనే దెయ్యం ఊరి ప్రజలని భయపెడుతుంది. తనని చుస్తే చాలు చంపేస్తుంది. అలాంటిది సాహసాలంటే ఇష్టపడే అర్జున్ దివ్యవతిని చూసేస్తాడు. మరి అతన్ని ఎందుకు చంపలేదు. అసలు ఒక దెయ్యాన్ని మనిషి ప్రేమించడం ఏంటి అతనికేమన్న పిచ్చా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే “లవ్ మీ ఇఫ్ యూ డేర్” సినిమా చూడాల్సిందే.
ఆశిష్ – వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు అనే ఒక యువ దర్శకుడితో “లవ్ మీ If you dare” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం బుల్లెట్ స్పీడ్ వేగంతో 50రోజుల్లో సినిమా పూర్తి చేసేసారు. మే 25న విడుదలవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ట్రైలర్ అమాంతం కొత్తగా ఇంట్రస్టింగ్ గా సాగింది. హీరో దెయ్యాన్ని ప్రేమించడం అనే పాయింట్ నే ఇప్పటివరకు తెలుగులో వచ్చిన హారర్ మూవీస్ ని ఈ మూవీని వేరు చేసి చూపిస్తుంది. కీరవాణి గారి మ్యూజిక్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ దివ్యవతి ఎవరు అన్న ప్రశ్న ఈ సినిమా చూడాలన్న క్యూరియాసిటీ రెట్టింపు చేస్తుంది. ఏషియన్ సత్యం థియేటర్లో వీలేకారులు, అభిమానుల సమక్షంలో ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసారు చిత్రయూనిట్. అనంతరం వీలేకారులతో చిత్రం యొక్క విశేషాలు పంచుకున్నారు. ఈ ఈవెంట్లో హీరోహీరోయిన్స్ ఆశిష్ , వైష్ణవి చైతన్య లతో పాటు చిత్ర దర్శకుడు అరుణ్ భీమవరపు, చిత్ర నిర్మాతలు నాగ మల్లిడి , హర్షిత్ రెడ్డి తో పాటు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, రవికృష్ణ కూడా పాల్గొన్నారు.