- Advertisement -spot_img
HomeReviews"లవ్ మీ if u dare" మూవీ రివ్యూ - film combat

“లవ్ మీ if u dare” మూవీ రివ్యూ – film combat

- Advertisement -spot_img

చిత్రం: లవ్ మీ if u dare
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: “సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్”
నటీనటులు: ఆశిష్ రెడ్డి , వైష్ణవి చైతన్య, రవికృష్ణ, రాజీవ్ కనకాల, సిమ్రాన్ చౌదరి తదితరులు
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి
దర్శకత్వం: అరుణ్ భీమవరపు
విడుదల : 25 మే 2024

మాములుగా ఒకప్పటిలా హారర్ సినిమాలకి మునుపటి క్రేజ్ లేదు. ఎన్ని హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాలొచ్చినా కూడా ఎంతసేపటికి దెయ్యం కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం, గతంలో ఏదో కారణం చేత మరణించి ఒక ఇంట్లోకి చేరడం, ఆ ఇంట్లోకి వచ్చిన హీరో కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేయడం, ఆ తర్వాత హీరో ద్వారా తమ లక్షాన్ని నెరవేర్చుకోవడం. జమానా కాలం నుంచి హారర్ సినిమాలన్నీ ఈ ఫార్ములా చిత్రాలే. మన దర్శకులు కూడా హారర్ చిత్రాలకి ఇంతకంటే ఇంకో కొత్త ఫార్ములాని ఆలోచించలేకపోతున్నారు. అందుకే తీసిన సినిమానే మన దర్శకులు మళ్లీ తీసి అలసిపోకున్న చూసే ఆడియన్స్ మాత్రం ఎప్పుడో అలసిపోయారు. అందుకే ఇప్పుడు హారర్ సినిమా వస్తుందంటేనే థియేటర్స్ వైపు కన్నెత్తి చూడడం కూడా మానేశారు. మరి ఇలాంటి సమయంలో దిల్ రాజు అండ్ కో “లవ్ మీ if u dare” అంటూ ఇంకో హారర్ చిత్రం అనౌన్స్ చేశారు. రెగ్యులర్ టైపు హారర్ చిత్రంగా కాకుండా దెయ్యాన్ని హీరో ప్రేమించడం అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ఈరోజు ప్రేక్షకులు ముందుకి వచ్చారు . పైగా సినిమా టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఆడియన్స్ కి కూడా రెగ్యులర్, రొటీన్ హారర్ చిత్రం కాకుండా ఏదో ఫ్రెష్ సినిమా చూడబోతున్నాము అనే అభిప్రాయం కల్గింది. మరి వారి అంచనాలకి తగట్టు సినిమాలో కొత్తదనం ఉందా, లేదా. సినిమా ఏమేరా ప్రేక్షకులని ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కధ:

అర్జున్( ఆశిష్ ) మరియు అతని బ్రదర్ ( రవికృష్ణ ) ఇద్దరు యూట్యూబర్స్. వీరితో పాటు ప్రియా( వైష్ణవి చైతన్య ) వీరి టీంలో ఒక పార్ట్ నర్. అయితే వీరు ఎప్పుడు అడ్వెంచర్ సంభందించిన కంటెంట్ నే పోస్ట్ చేస్తారు. అయితే అనుకోకుండా వీళ్లకి దివ్యవతి యొక్క కధ దొరుకుతుంది. అందులో దివ్యవతి ఒక దెయ్యం ఆమెని ఎవరైనా చుస్తే చాలు చంపేస్తుంది. అలా ఆ దివ్యవతి కధ తెలుసుకుందాం అని వెళ్లిన కొంతమందిని చంపేస్తుంది ఆ దెయ్యం. అయితే అర్జున్ కి ఈ దివ్యవతి కధ బాగా నచ్చేస్తుంది. సహజంగానే అడ్వెంచర్స్ చేయడం ఇష్టపడే అర్జున్ ఈ దెయ్యంతో కూడా ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటాడు. అందుకోసం ఆ దెయ్యాన్ని కెమెరాలో బంధిస్తే లక్షలలో వ్యూస్ వస్తాయి అని ఆశించి, ఆ దెయ్యం ఉండే అపార్ట్మెంట్ కి వెళ్తాడు. అక్కడ అర్జున్ కి ఎలాంటి సవాళ్లు ఎదురైయ్యాయి, అసలు ఎవరు ఈ దివ్యవతి ?ఎందుకు మనుషులని చంపుతుంది? అసలు అర్జున్ దివ్యవతిని ఎందుకు ప్రేమిస్తాడు?. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దెయ్యంతో ప్రేమాయణం ఇదో సరికొత్త కాన్సెప్ట్. దెయ్యంకి జీవిత ఆశయాలు ఉండడం, దెయ్యం ప్రత్యర్థుల పై పగ తీర్చుకోవడం లాంటి కాన్సెప్ట్స్ తెలుగులో చాలానే చూశాం. కానీ దెయ్యాన్ని ఒక మనిషి ప్రేమించడం అనే పాయింట్ మాత్రం ఇదే తొలిసారి. ఈ పాయింట్ నే తెలుగు లో వచ్చిన మిగితా హారర్ సినిమాలని ఈ సినిమాని వేరు చేసి చూపిస్తుంది. ఈ పాయింట్ నే ప్రేక్షకులు ముఖం చాటేసిన హారర్ సినిమాలకి మళ్లీ తిరిగి థియేటర్స్ వైపు వచ్చేలా చేసింది. అలా థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని ఈ పాయింట్ తో దర్శకుడు అరుణ్ భీమవరపు బాగానే అలరించాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా రెండున్నార గంటలు బాగానే కుర్చోపెట్టాడు.

నటీనటుల పనితీరు:

ముందుగా హీరో ఆశిష్ గురించి మాట్లాడుకుంటే మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాతో బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు తన పెర్ఫార్మన్స్. తన పర్సనాలిటీ కూడా ఈ సినిమాలోని తన పాత్రకి సరిగ్గా సెట్ అయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో చాలా చక్కగా చేసాడు. అతని అన్నగా చేసిన రవికృష్ణ కూడా ఉన్నంత సైపు చాలా చక్కగా చేసాడు. ఇంకా హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా మరోసారి మెప్పిస్తుంది. “బేబీ” సినిమాతో అందరిని అలరించి జీవితంలో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసిన వైష్ణవి చైతన్య. ఇందులో కూడా తన సెటిల్డ్ యాక్టింగ్ తో మరోసారి మెప్పిస్తుంది. బేబీ అంత గొప్ప పాత్ర కాకపోయినప్పటికి ఈ సినిమాలో కూడా మరో గుర్తుండిపోయే పాత్రే చేసింది. ఇంకా సిమ్రాన్ చౌదరి పాత్ర కూడా మెప్పిస్తుంది. ఇంత వరకు తెలుగులో ఎవరు పోషించని పాత్ర ఆవిడ పోషించింది. రాజీవ్ కనకాల మాత్రం కేవలం ఒక్క సీన్ వరకే పరిమితమయ్యాడు.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ కథ. ఒక సరికొత్త హారర్ ఎలెమెంట్స్ తో ప్రేక్షకులని బాగానే థ్రిల్ చేసాడు దర్శకుడు అరుణ్. ముఖ్యంగా క్లైమాక్స్ లో సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కువసేపు సినిమా అంతా నైట్ షూట్ చేయడంతో ఒక అసలు సిసలైన ఘోస్ట్ సినిమా చూస్తున్నాము అన్న ఫీలింగ్ కల్గుతుంది. అందుకు తగత్తె కీరవాణి గారి బాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ఆయన బాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. కెమెరామాన్ పనితీరు కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ లో క్వాలిటీ కనిపిస్తుంది. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడ వెనక్కి తగ్గకుండా చాలా బాగా తీశారు సినిమాని.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ సాంగ్స్. ఇందులో 4 పాటలున్నాయి అందులో ఒక్కటి కూడా ఆకట్టుకోదు. ఒక్క “రావాలిరా” సాంగ్ ఒక్కటే కొంచం బాగుంది. ఇంకో మైనస్ పాయింట్ ఎడిటింగ్ టీం వర్క్. సినిమా అంత చాలా చోట్ల ఫాస్ట్ మోడ్ లో ఉంది. ఎడిటింగ్ వర్క్ మీద దర్శకుడు ఇంకొంచం ఎక్కువ శ్రద్ద పెడితే బాగుంది అనిపిస్తుంది.

రివ్యూ బై: నవీన్ మాదినేని

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page