- Advertisement -spot_img
HomeMoviesప్రొమోషన్స్ లో మాస్టర్ మైండ్ నాగ అశ్విన్: కనివిని ఎరుగని రీతిలో కల్కి ప్రొమోషన్స్ -...

ప్రొమోషన్స్ లో మాస్టర్ మైండ్ నాగ అశ్విన్: కనివిని ఎరుగని రీతిలో కల్కి ప్రొమోషన్స్ – FilmCombat

- Advertisement -spot_img

సినిమా చిత్రీకరణ, చూపించే విధానం రెండూ వేరువేరు. చిత్రీకరణ దర్శకుడి పని తీరు, కానీ చూపించే విధానం కూడా తెలిసినోడే సినిమా రాజ్యాన్ని ఏలుతాడు. అలాంటి వ్యక్తి, సృష్టికర్త యువ దర్శకుడు నాగి. చేస్తున్నది మూడొవ చిత్రం అయినప్పటికీ, అతని కథని నమ్మి హీరోగా ఒప్పుకున్నారు ప్రభాస్. ఎంత ఖర్చు చెయ్యటానికైనా సిద్ధం అయ్యింది తన సొంత మామగారి నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. ఎంతో పెద్ద స్టార్ తారాగణం. ప్రభాస్, దీపికా, కమల్ హాసన్, అమితాబ్, దిషా, నాని, విజయ్ దేవరకొండ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. మన పురాణాలు, వాటిలో ఉన్న నిజమైన పాత్రలు, ఇప్పటి టెక్నాలజీ, వర్తమానంలో జరగబోయే పరిణామాలలోంచి తీసుకున్న కథనే కల్కి 2898 AD. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. అశ్వినీ దత్ గారు నిర్మాత. ఈ చిత్రాన్ని నిర్మించటానికి, ప్రమోషన్ చెయ్యటానికి అనుకున్న ఖర్చు అక్షరాలా 700 కోట్లు పైమాటే. కానీ ఇంకా పట్టుమని నెల కూడా లేదు విడుదల చెయ్యటానికి, కానీ నాగి టీం ఇంకా ప్రొమోషన్స్ చెయ్యట్లేదు అని ప్రభాస్ అభిమానులే కాదు, యావత్ సినీ ప్రపంచమే ఆలోచిస్తోంది. భారీ తారాగణం, ప్రభాస్, భారీ ఖర్చు పెడితే సినిమా జనాలలోకి ఎక్కేయదు కదా అని అందరి అనుమానం. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆడిన మైండ్ గేమ్ ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పటికే ఎప్పుడూ, ఎక్కడా, ఏ చిత్రానికీ జరగనుటువంటి అబ్దుతమైన ప్రొమోషన్ చేసేసారు ఆయన. ఎలానో అర్థం కాలేదు కదా? అయితే పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి మీకే అర్థం అవుతుంది.

మొదటగా ఆయన ప్రమోషన్ మొదలు పెట్టింది ప్రభాస్ ఫస్ట్ లుక్ భైరవ తో అని అందరూ అనుకున్నారు, తరువాత నిజమైన టైటిల్ విడుదల ప్రమోషన్ అనుకున్నారు, అమితాబ్ గారి అశ్వద్ధామ టీజర్ ఏమో అనుకున్నారు. కానీ అసలైన ప్రమోషన్ మొదలయ్యింది “బుజ్జి” తో. బుజ్జి ఒక చిన్న రోబోట్. ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ బుజ్జి రోబోట్ కి డబ్బింగ్ ఇచ్చారు. దానికి ప్రాణం ఉంది కానీ ఆకారంలేదు. ఈ చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన టెక్ మహీంద్రా తో చేతులు కలిపి ఒక అత్యాధునిక ఎలెక్ట్రిక్ కార్ ని తయారుచేసారు ఈ చిత్ర బృందం. 6 టన్నుల బరువున్న ఈ కార్ తయారీకి పెట్టిన ఖర్చు 7 కోట్లు మాత్రమే. కానీ ఇందుకోసం ఒక పెద్ద ఈవెంట్ పెట్టి ప్రభాస్ సొంతంగా ఆ కార్ ని నడిపి అందరికీ చూపించే విధంగా ప్రమోట్ చేసారు నాగి. ఒక్క సినిమా కోసం కాకపోతే నిజానికి ఆ కార్ ఇంక బయట ఉపయోగించటానికి ఉండదు. అలాంటి పరికరాన్ని సృష్టించి ప్రపంచం మొత్తం ఈ చిత్రం వైపు తిరిగి చూసేలా చేసారు ఆయన.

కస్టపడి తయారు చేసిన బుజ్జి హై టెక్ కార్ ని, అది ప్రభాస్ ప్రమోషన్ కోసం ఏదో అలా నడిపి వదిలేసాడు, దానికేమీ సత్తా లేదు అనుకునేవాళ్లు లేకపోలేదు. అలా అవ్వకుండా కార్ కలెక్షన్ అంటే పిచ్చి ఉన్న నటుడు నాగ చైతన్య ని పిలిచి రియల్ రేసింగ్ ట్రాక్ మీద కార్ ని నడపమన్నారు చిత్ర బృందం. ఆయన ఈ కార్ నడిపి ఇలాంటి అద్భుతాన్ని ఎక్కడా చూడలేదు, చూడలేము అని ప్రశంసించారు. ఆయన ఒక్కరే కాదు ఇండియన్ ఫార్ములా 1 రేసర్ స్వయంగా వచ్చి అదే ట్రాక్ మీద ఈ బుజ్జి కార్ ని నడిపి చూసారు. ఆశ్చర్య చికితుడు అయ్యారు. ఇది నాగి చేసిన రెండొవ ప్రమోషన్.

ప్రపంచంలోనే ఎక్కువ మోతాదు ఎలక్ట్రిక్ కార్ లు తయారీ సంస్థ టెల్సా, స్పేస్ X సంస్థ ప్రతినిధి అయిన ఎలోన్ మస్క్ కి ట్విట్టర్ లో నాగి ట్వీట్ చేసి, కల్కి చిత్రం కోసం బృందం తయారు చేసిన ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ ని స్వయంగా వచ్చి నడిపి చూడమని ఆహ్వానం పంపారు. ఒక తెలుగు చిత్ర దర్శకుడు, టెక్నాలజీ లోనే ప్రముఖ దిగ్గజాన్ని ప్రపంచం తెలిసేలా ఆహ్వానం పంపించటం కన్నా మించిన ప్రమోషన్ ఇంకోటి లేదు. ఒకవేళ ఆయన ఒప్పుకుని ఇండియా వచ్చి ఈ బుజ్జి కార్ ని నడిపితే ప్రపంచ సినిమా ఇండస్ట్రీ లు మొత్తం కల్కి చిత్రం ముందు మోకరిల్లుతాయి.

ఇది కాకుండా ఇంకొక అద్భుతం నాగి చేసింది ఏంటి అంటే ఒక టెక్నాలజీ మూవీ ని మాస్ ప్రేక్షకులకి కూడా అర్థం అయ్యేలా చెయ్యటానికి వేసిన ప్రణాళిక బుజ్జి, భైరవ అనిమేషన్ సిరీస్ వీడియో సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ చెయ్యటం. దానివల్ల సినిమా విడుదలకి ముందే అసలు వాళ్లిద్దరూ ఎలా కలిశారు, ఆ కార్ ని భైరవ బుజ్జి సహాయంతో ఎలా తయారుచేసాడు అనే విషయాన్నీ చూపించి, మళ్ళీ సినిమాలో ఇవే సన్నివేశాలు చూపించకుండా ముఖ్యమైన కథనాన్ని చూపించాలి అని చేసుకున్న ప్రణాళిక. సినిమా విడుదలకి ముందే తెలిసేలా చేసి మళ్ళీ అంత సమయాన్ని వృధా చెయ్యకుండా ముఖ్యమైన అంశాలకోసం ఉపయోగించాలి అనుకున్న స్క్రీన్ ప్లే అమోఘం. ఇలాంటి ప్రమోషన్ ఇప్పటివరకు ఎవ్వరూ చూసి ఉండరు. త్వరలో ట్రైలర్ , ఇంకా పాటలు విడుదల అవ్వబోతున్నాయి, కానీ ఇప్పటికే సినిమాకి కావాల్సినంత ప్రొమోషన్స్ వచ్చేసాయి. ఎలోన్ మస్క్ కనక నిజముగా వచ్చి బుజ్జి ని నడిపితే ఇంక తిరుగే ఉండదు. ఎంతైనా ఒక తెలుగు వాడి తెలివి మాములుగా ఉండదు అని నిరూపించారు నాగి. వేచి చూద్దాం నాగి వేసిన ఈ ప్రణాళిక ఎలా సినిమా విజయానికి మంచి బాట వేస్తుందో. ఈ చిత్రం జూన్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో చాలా భాగాలు ఉన్నాయని వినికిడి.

ఆర్టికల్ బై: సాయిరాం తాడేపల్లి

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page