యావత్ ప్రపంచం ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కల్కి 2898 AD జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతోంది. ఆ చిత్ర యూనిట్ మహీంద్రా కంపెనీ తో కలిసి తయారుచేసిన అత్యాధునిక కార్ బుజ్జి తో ఇండియా అంతా టూర్ వేసి ప్రొమోషన్స్ చేస్తున్నప్పటికీ, అవి సరిపోవట్లేదు అని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే పంజాబీ సింగర్ దిల్జిత్ తో కలిసి Bhairava Anthem అని ఒక సాంగ్ విడుదల చేస్తున్నాం అని ప్రోమో అప్డేట్ ఇచ్చారు. తీరా ప్రోమో చూస్తే అంతా పంజాబీ హిందీ కలిపి ఉంది. మళ్ళీ మొత్తం పాటని 16వ తారీఖున రాత్రి 8 గంటలకి విడుదల చేస్తాం అన్నారు. తీరా ఆ టైం అయ్యాక ఏదో సమస్య వలన ఈరోజు పొద్దున్న 11 గంటలకి మొత్తం పాటని విడుదల చేసారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా ఈ పాట ఎలా ఉండబోతోందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయానికి మొత్తం పాట విడుదల అయ్యింది. ఇది తెలుగు పాట లేకపోతే పంజాబీ, హిందీ కలిపిన పాటనా అని తెలుసుకోవాలని వేచిచూసారు. మొత్తానికి పాట మొదలు తెలుగు లోనే వచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పేల్చుకునేలోపు దిల్జిత్ తన పంజాబీ పదాలని అందుకున్నారు. పాట అయితే బాగుంది. భైరవ యొక్క క్యారెక్టర్ చెప్తూ మంచిగానే ఉంది. కాకపోతే మొత్తం తెలుగు పాట కాకుండా ఇలాగ రెండు భాషల్ని ఎందుకు కలిపారో తెలియట్లేదు. పాట మంచిగా ఉన్నపటికీ ఎక్కడో కొంచెం నిరుస్తాహంతో అభిమానులు ఉన్నారు. పాటలో దిల్జిత్, ప్రభాస్ వేసుకున్న డ్రెస్సులు కూడా పంజాబీ స్టైల్ లోనే ఉన్నాయి. పంజాబీ స్టైల్ డ్రెస్ లోకూడా ప్రభాస్ పంచెకట్టు టైపు లో పోజులు ఇచ్చారు. ఏదోకటి చేసి మంచి ప్రొమోషన్స్ చెయ్యండి అని ఫాన్స్ గగ్గోల పెడుతున్నారు సోషల్ మీడియా లో. ఇప్పటికైనా డైరెక్టర్ కొంచెం ముందు చూపుతో ప్రొమోషన్స్ మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే విడుదలకి ఒక 10 రోజులు మాత్రమే ఉన్నాయి మరి.