రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
చిత్రం: అలనాటి రామచంద్రుడు
విడుదల తేదీ: ఆగస్ట్- 2 – 2024
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: ఫీల్ గుడ్ లవ్ మ్యూజికల్ ఫిల్మ్
నటి నటులు: కృష్ణ వంశీ, మోక్ష, చైతన్య గరికిపాటి, ప్రమోదిని పమ్మి, సుధా, స్నేహ మాధురి, జాను నారాయణ, దివ్య శ్రీ తది తరులు….
ఎడిటర్: శ్రీకర్
సినిమాటోగ్రాఫర్: ప్రేమ్ సాగర్
సంగీతం: శశాంక్ తిరుపతి
సహ రచయిత: శ్రీకాంత్ మందుముల
అసోసియేట్ ప్రొడ్యూసర్: విక్రమ్ జమ్ముల
సహ నిర్మాత: కె. జగదీశ్వర్ రెడ్డి
ప్రొడక్షన్: హైనివా క్రియేషన్స్ LLP
నిర్మాతలు: హైమావతి జడపోలు, శ్రీరామ్ జడపోలు
రచన, దర్శకత్వం: చిలుకూరి ఆకాష్ రెడ్డి
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. SVC (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ద్వారా ఈ చిత్రం ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు పెరిగాయి. ఇక, ఈ రోజు సినిమా విడుదల సందర్భంగా మన “ఫిల్మ్ కాంబాట్” రివ్యూ చూద్దాం!
కథ:
“కృష్ణ వంశీ(సిద్ధు)” చిన్నప్పటి నుంచి తన లోకంలో ఇంట్రావట్ గా పెరుగుతాడు. ఒక రోజు “మోక్ష(ధరణి)ని” చూసి కృష్ణ వంశీ ఆమె ప్రేమలో పడతాడు, అప్పటి నుంచి తనలో మార్పు రావడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రపోజ్ చేసే లోపల, అప్పటికే “విక్రమ్” అనే అబ్బాయితో “మోక్ష” లవ్ లో ఉంటుంది. 15 సంవత్సరాల తరువాత మనాలి లో ఉన్న తన తండ్రి(బ్రమ్మాజి)ని కలిసి ప్రేమించిన వ్యక్తి ని పరిచయం చేస్తుంది. కాకపోతే, విక్రమ్ ప్లేస్ లో కృష్ణ వంశీ(సిద్ధు) ఉంటాడు. అదేంటి ప్రేమించుకుంది విక్రమ్ & ధరణి కదా! సిద్ధూ ఎందుకు ఉంటాడు? చివ్వరికి, ప్రకృతి ఎవ్వరి ప్రేమను కలిపింది? మోక్ష 15 సంవత్సరాల వరుకు తన తండ్రిని ఎందుకు కలవలేదు? అనేది తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా సినిమా థియేటర్ లో చుడాలిసిందే?
విశ్లేషణ: కొన్ని దశాబ్దాల నుంచి “ప్రేమ” అనే రెండు అక్షరాల పదం ఒక్కటే అయ్యినప్పటికీ ప్రేమించే విధానంలో మార్పులు చూస్తూ వచ్చాం! ఈ కథలో ప్రేమించే విధానం పాతదే అయ్యినప్పటికీ ప్రతి ప్రేక్షకుడు ఆ ప్రేమని ఫీల్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కాకపోతే, అక్కడక్కడ కాస్త బోరింగ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ బిజియమ్ తో ప్రాణం పోసాడు. నిన్ను చూడన నన్ను నేను చూడనంత, నిన్ను చదవన పుస్తకాన్ని చదవనంత…అంటూ సాగే లిరిక్స్ థియేటర్ లో ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటుంది.
కాలేజ్ లో శ్రీశైలం గ్యాంగ్ తో జరిగే సన్నివేశాలు, స్నేహ మాధురితో జరిగే క్యూట్ కాన్వర్ జేషన్, చిన్నప్పుడు మోక్ష(ధరణి) చెప్పే రైమ్ నవ్విపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ధరణి వెనకాల సిద్ధూ పడే సన్నివేశాలు వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే కాంబినేషన్ సీన్స్ బాగుంటాయి. ముఖ్యంగా, సెకండ్ హాఫ్ లో ఇద్దరి మధ్య జరిగే ఎమోషన్ రైడ్ కన్నీరు తెప్పిస్తాయి.
కొన్ని సన్నివేశాలకి సరైన ముగింపు ఇచ్చి ఉంటే బాగుండేది. సినిమాలో అక్కడక్కడ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకోవడంతో పాటు, హీరో ఫాలో అయ్యే ఫిలాసఫీ బాగుంటుంది. ఈ సినిమా చూసాక కనీసం మీరైనా, మీరు ప్రేమించిన అమ్మాయికి గాని, అబ్బాయికి గాని ప్రపోజ్ చేస్తారని, ఫ్యామిలీస్ & ఫ్రెండ్స్ నిద్రకి, మనశాంతికి భంగం కలిగేంచేలా చేయరని కోరుకుంటూ మనవి!
నటి నటుల పెర్ఫామెన్స్:
తెలుగు తెర కి హీరో ‘కృష్ణ వంశి’ కొత్త వాడైనప్పటికీ
సిద్ధు క్యారెక్టర్ లో చాలా చక్కగా ఓదిగిపొయ్యి, కొన్ని సన్నివేశాలలో ఇన్నోసెంట్ లుక్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. హిట్, ఫ్లాప్ లు పక్కన పెడితే, ఫ్యూచర్ లో ఈ హీరో పెద్ద హీరోలకి కాంపిటేషన్ ఇవ్వడం పక్కా అనిపిస్తుంది. తండ్రి పాత్రలో నటించిన “బ్రమ్మాజి” నిడివి తక్కువే అయ్యినప్పటికీ ఎమోషనల్ గా ఉంటుంది.
సినిమాలో ప్రధానమైన పాత్ర పోషించి కథ ని ముందుకి నడిపించిన హీరోయిన్ “మోక్ష”. ప్రతి ఫ్రెమ్ లో అందంతో, అభినయంతో, అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రతి ప్రేక్షకుడిని తన వైపు చూపు తిప్పుకునేలా చేసింది.
ఇకపోతే, సుధా, వెంకటేష్, చైతన్య, దివ్య శ్రీ, స్నేహ మాధురి, జాను నారాయణ తమ పరిధి మేరకు యాక్టింగ్ బాగా రాణించారు.
సాంకేతిక విభాగం:
డైరెక్టర్ ‘చిలుకూరి ఆకాష్ రెడ్డి’ కథ ఎంచుకున్న తీరు సినిమా మొత్తం ఫీల్ గుడ్ క్యారీ చేసిన విధానం బాగుంది. కాకపోతే, ఇంకాస్త స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ తో పాటు ఇంట్రస్టింగ్ క్రియేట్ చేసే సీన్స్ మీద ఫోకస్ చేసి ఉంటే సినిమా తారా స్థాయిలో ఉండేది. కొన్ని సన్నివేశాలని ఎమోషనల్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి వెన్నుముక లా నిలిచింది. కొన్ని సందర్భాలలో ఇది మ్యూజికల్ ఫిల్మ్ ఆ ఏంటి అనిపిస్తుంటుంది. ఎడిటింగ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాలిసింది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఓ మేరకి పర్వాలేదు.
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.