కొణిదెల చిరంజీవి గారు లాంటి పెద్ద ఉన్నత కుటుంభం నుంచి వచ్చిన, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ఏ రోజు కూడా ఆ ఇమేజ్ ని తన మీద పడకుండా జాగ్రత్త పడ్డారు. తానూ చిటికేస్తే పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు, గుర్తుండిపోయే పాత్రలు చేసి ఉండచ్చు. కానీ తాను గొప్పింటి అమ్మాయి అని ఎక్కడ అహంకారం, పలుకుబడి చూపించలేదు.
ఆనాడు పెద్దనాన్న మెగా స్టార్ చిరంజీవి గారు ఎలా అయితే అంచెలు అంచెలు గా సినిమాల్లో ఎదిగి, రాళ్ళూ రప్పలు ఉన్నాయని తెలిసిన కూడా యాక్ట్ చేస్తూ, స్వయంకృషి లా ఎదిగారో…..అదే పౌరుషం, విధేయత మరియు పట్టుదల ఈనాటి మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల కూడా అదే పంధాలో వెళ్ళటం ప్రశంసనియం.
అప్పటికే సూపర్ హిట్ అయినా “ఢీ” షోలో యాంకర్ గా తన కేరీర్ ని స్టార్ట్ చేసి మొదటి మెట్టులోనే తానేంటో ప్రూవ్ చేసుకున్న చిన్నారి మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల.
అతి తక్కువ కాలంలోనే కామిడి టైమింగ్, యాంకరింగ్ తో పాటు పేరు ప్రఖ్యాతలు పొంది ప్రేక్షకులకి మరింత చేరువ అయ్యారు. కాబట్టే, యంగ్ హీరో నాగశౌర్య “ఒక మనసు” చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.
సినిమా రిజల్ట్ పక్కన పెడితే నటిగా మెగా ప్రిన్సెస్ నిహారిక ప్రేక్షకులని మెప్పించారు. ఈ సినిమా తర్వాత కూడా “హ్యాపీ వెడ్డింగ్”, “సూర్యకాంతం” వంటి సినిమాల్లో హీరోయిన్ గా రాణించారు. “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్” అనే తమిళ్ సినిమాలో విజయ్ సేతుపతి లాంటి జాతీయ స్థాయి నటుడి పక్కన యాక్ట్ చేసి తన టాలెంట్ ని పరీక్షించుకున్నారు .
అటు సినిమా రంగంలో యాక్ట్ చేస్తూ, బుల్లి తెర మీద యాంకరింగ్……ఓటిటి లో నాన్న కూచి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ పలు వెబ్ సిరీస్ లకి నిర్మాత గా వ్యవహరించి లక్కీ చార్మ్ అనిపించుకున్నారు.
మెగా ప్రిన్సెస్ నిహారిక కి సినిమా అంటే స్వచ్ఛమైన ప్రేమ, అభిమానం. సినిమా అంటే తనకి తోబోట్టువు లాంటిది…ఒక విధంగా చెప్పాలి అంటే, ఎలాంటి కల్మషం లేకుండా అమ్మ ఏ విధంగా తన కన్న బిడ్డలకి గోరు ముద్దలు తినిపిస్తుందో! అలా…….అందుకే, కాబోలు “కమిటి కుర్రోళ్ళు” సినిమాతో ప్రొడక్షన్ రంగంలోకి దిగటమే కాకుండా తన ఫస్ట్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు.
“పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్” ప్రొడక్షన్ ద్వారా ఆమె నిర్మించిన “కమిటీ కుర్రోళ్ళు” అనే చిత్రం గత శుక్రవారం రిలీజై తిరుగులేని అఖండ భారత్ విజయం సాధించింది. యూత్ ని టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ చిత్రం అన్ని రకాల మిక్సడ్ ఎమోషన్స్ ని ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.
కేవలం, 6కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం రిలీజైనా మూడు రోజులోనే పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టి డిస్టిబ్యూటర్స్, నిర్మాతలని లాభాల్లోకి తీసుకెళ్లింది. ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడానికి దర్శకుడు యదు వంశీ తో పాటు నిర్మాత మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల కష్టం కూడా అంతే ఉంది.
దర్శకుడు యదు వంశీ సినిమాని అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో సినిమా తీసినప్పటికి, నిర్మాతగా నిహారిక కొణిదెల అన్ని దగ్గరుండి చూసుకోవటం. సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్లిన విధానం, ప్రమోషన్స్ తో జనం దృష్టిని ఆకర్షించిన విధానం. తన తొలి ప్రయత్నాన్ని మెగా కుటుంబం కూడా బాగా సపోర్ట్ చేయటంతో………నిర్మాతగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల 100% సక్సెస్ అయ్యారు.
తన తొలి సినిమాకే 11మంది కొత్త యాక్టర్స్ తో పాటు ఎవ్వరి దగ్గర పని చేయని ఒక కొత్త డైరెక్టర్ కి ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం అనేది చాలా రిస్క్. రిస్క్ తెలిసినప్పటికీ ఈ విషయంలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్మాత గా నిహారిక చూపించిన ఈ పరిణీతి ఎంత అభినందించిన తక్కువే. నిర్మాతగా ప్రిన్సెస్ నిహారిక ఈ స్థాయి పరిణీతి తన తదుపరి సినిమాలకి కూడా చూపిస్తే భవిషత్తులో సురేష్ ప్రొడక్షన్స్, గీత ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మాదిరి “నిహారిక కొణిదెల ప్రొడక్షన్స్” కూడా ఎదగడం ముమ్మాటి కి ఖాయం.
భవిషత్తులో నటిగానే కాకుండా నిర్మాతగానూ మరింత ఉన్నత శిఖరాలకి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే “కమిటీ కుర్రోళ్ళు” చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా “ప్రిన్సెస్ నిహారిక కొణిదెల అండ్ తన టీం” కి బిగ్ కంగ్రాట్స్ ఫ్రమ్ టీం filmcombat.