Table of Contents
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
చిత్రం: కళింగ
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: Hold Your Breath for This Jaw-Dropping Thriller!🔥
నటి నటులు: ధృవ వాయు, ప్రజ్ఞా నయన్, అడుకలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు
ఎడిటర్: నరేష్ వేణువంక
మ్యూజిక్ డైరెక్టర్: విష్ణు శేఖర మరియు అనంత నారాయణన్
బ్యా గ్రౌండ్ స్కోర్: విష్ణు శేఖర
సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్ పొడిశెట్టి
ప్రొడక్షన్: బిగ్ హిట్ ప్రొడక్షన్
డైలాగ్స్: యాకూబ్ షేక్
రైటర్స్: ధృవ వాయు, రామారావు జాదవ్ మరియు యాకుబ్ షేక్
నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృథివి యాదవ్
డైరెక్షన్: ధ్రువ వాయు
కళింగ మూవీ రివ్యూ: Kalinga Movie Review #FilmCombat
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ‘ధృవ వాయు’ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా మీద ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ పోస్టర్లు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 13న విడుదలవుతున్న సందర్భంగా, ముందు రోజు ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు ప్రీమియర్ షో నిర్వహించారు. సో, అసలు కథలో కి వెళ్దాం…
కథ:
తెలంగాణలోని ‘కళింగ గ్రామం’లో లింగం(ధృవ వాయు) ఒక ‘అనాథ‘. పొట్టకుడు కోసం తన ఫ్రెండ్ ‘ముత్తు’(లక్ష్మణ్ మీసాల)తో కలిసి ఇద్దరు ‘మధ్యం’ అమ్ముతుంటారు. లింగం & ‘పద్దు'(ప్రజ్ఞా నయన్) ఇద్దరి మధ్య ‘ప్రేమ’ చిగురిస్తుంది. ఇద్దరి పెళ్లి కి, పద్దు ‘తండ్రి’….ఆ ఊరి దొర బాబు ‘పటేల్'(అడుకలం నరేన్) దగ్గర తాకట్టు పెట్టిన ‘పొలం’ డాక్యుమెంట్స్ తీసుకువస్తే పెళ్లి అని షరతు పెడతాడు. దొర బాబు ఏ గొడవ చేయకుండ, ‘పొలిమేర’ అవతల ఉన్న పొలాన్ని ‘లింగం’ కి ఎందుకు ఇచ్చాడు? కుట్ర ఏమైనా ఉందా? పైగా, పొలిమేర దాటితే ప్రాణాలతో తిరిగి రారు అని తెలిసిన ‘లింగం’ పెళ్లైన భార్య ని వదిలేసి ఎందుకు వెళ్ళాడు? పొలం కోసం వెళ్లాడా? లేదంటే, ‘అసుర రాక్షసి’ ని అంతు చూడటానికి వెళ్లాడా? లేదంటే, ఎవ్వరికి తెలియని రహస్యం ఇంకేదైన అక్కడ ఉందా? తెలియాలి అంటే మీరు సినిమా ఖచ్చితంగా థియేటర్ లో చుడాలిసిందే?
విశ్లేషణ:
మొదట్లో ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసి చాలా మంది కాంతారనా, విరూపాక్షనా?.. మంగళవారంలా ఉంటుందా? అని ప్రతి ఒక్కరు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసారు. సినిమా చూసాక మిరే అంటారు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని…‘కథ రాసి.. డైరెక్టర్ చేసి.. నటించడం అంటే మామూలు విషయం కాదు. పైగా, ఎంతో మంది ఆల్ రౌండర్ గా పెర్ఫామెన్స్ ఇచ్చిన లక్ ఫెవర్ చేయలేదు! మరి, ధ్రువ వాయు కి లక్ వరించిందా! లేదో మిరే సినిమా చూసి చెప్పాలి.
1922లో కథ స్టార్ట్ అయ్యి మెల్లగా ప్రెజెంట్ లోకి వస్తుంది. అయ్యితే, పాస్ట్ లో జరిగిన కొన్ని సీన్స్ మరి ముఖ్యంగా ఒక కిడ్ చెవి కోసుకునే సన్నివేశం థియేటర్ లో చుస్తున్నప్పుడు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ ప్రజెంట్స్ లో జరిగే కొన్ని సీన్స్ సాగదీతగా అనిపించినప్పటికీ హీరో & హీరోయిన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. సినిమాలో కొన్ని భయపెట్టే సీన్స్ తెరకెక్కించిన విధానం బాగుంది. ఇంటర్వెల్ సూపర్బ్. అక్కడక్కడ దొరబాబు కొడుకు బాలి కి – హీరో కి మధ్య సాగే ఫైట్ సీన్స్ రక్తి కట్టిస్తాయి.
Q: How is the movie Kalinga, released on September 13, 2024?
A: It is a spine-chilling suspense thriller and is notable for its exceptional background music, which is a major asset of the film.
సెకండ్ హాఫ్ లో పెళ్లి తో ముడిపడిన సాంగ్ ఆకట్టుకుంటుంది. పొలిమేర దాటాక లింగం & ముత్తు మధ్య సాగే సన్నివేశాలు ఫన్నీ గా ఉంటాయి. ఇద్దరు కలిసి దేని కోసమో సెర్చ్ చేస్తున్న ప్రోసెస్ థియేటర్స్ లో కేక పుట్టిస్తాయి. ముఖ్యంగా అసుర రాక్షసితో తలపడే సన్నివేశాలు దాని ఆకారం భయానకంగా ఉంటాయి. అసుర రాక్షసి ఆకారం చాలా న్యాచురల్ గా చూపించారు. ప్రి క్లైమాక్స్ లో హీరో రివీల్ చేసే ఒక ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్ సూపర్బ్. ఓవర్ ఆల్ డైరెక్టర్ ది బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చారనే చెప్పాలి. సినిమాను చూసిన తరువాత ఓ మంచి ఫీలింగ్‌తో బయటకు వెళ్తారు.
నటి నటులు పెర్ఫామెన్స్:
హీరో ధృవ వాయు పాతకాలం మనిషి పాత్రలో ఓదిగిపోయి ఎంతో సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ప్రజ్ఞా నయన్ అందంతో పాటు ముఖ్యమైన సీన్స్ లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి శబాష్ అనిపించుకున్నారు. అడుకలం నరేన్ సీన్స్ నిడివి తక్కువే అయ్యినప్పటికీ మంచి పోటీ ఇచ్చారు. లక్ష్మణ్ మీసాల స్క్రీన్ మీద ఉన్నంత సేపు నెస్ట్ ఏం జరుగుతుంది అనేలా ఇంట్రస్ట్ క్రియేట్ అవ్వుతుంది. తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం:
డైలాగ్స్, రైటింగ్, స్టోరీ లైన్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో ఇంకాస్త పదును పెట్టి ఉంటే సినిమా వేరే లెవెల్. కానీ, సినిమా చూస్తున్నంత సేపు మీరు థ్రిల్ అవ్వుతారు. డైరెక్షన్ స్కిల్స్ సూపర్బ్. సినిమా మంచి ప్రసంశలు అందుకుంటుంది అంటే దానికి ప్రధాన కారణం మ్యూజిక్ & బ్యాగ్రౌండ్ స్కోర్. ఎడిటర్ పని తీరు బాగుంది. విజ్యువల్స్ ఏ మాత్రం తగ్గకుండా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కి కావలిసిన అన్ని హంగులు డిఓపి అక్షయ్ రామ్ పొడిశెట్టి అందించారు. అతి తక్కువ బడ్జెట్ లో అంత మంచి విజ్యువల్స్ అందించి, సినిమా రీలిజ్ చేసిన ప్రొడక్షన్ బ్యానర్ కి హ్యాట్స్ ఆఫ్.
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.