- Advertisement -spot_img
HomeMoviesగ్లోబల్ స్టార్ గేమ్ ఛేంజర్ నుంచి "రా మచ్చ మచ్చ" పాట విడుదల - FilmCombat

గ్లోబల్ స్టార్ గేమ్ ఛేంజర్ నుంచి “రా మచ్చ మచ్చ” పాట విడుదల – FilmCombat

- Advertisement -spot_img

మెగా పవర్ స్టార్ అనే టైటిల్ కార్డు తోనే కెరీర్ మొదలు పెట్టిన యంగ్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ట్ అవతారం ఎత్తారు. ఏ సినిమా తో అని ఆలోచిస్తున్నారా దిల్ రాజు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం శంకర్ దర్శకత్వం వహిస్తున్న “గేమ్ ఛేంజార్”. థమన్ సంగీతం అందిస్తుండగా, కైరా అద్వానీ కథానాయికగా చేస్తున్నారు. ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. సునీల్, SJ సూర్య, శ్రీకాంత్ ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. శంకర్ చిత్రాలు అంటే భారీ పాటలు, గ్రాఫిక్స్ అని అందరికీ తెలిసిన విషయమే. కమలహాసన్ భారతీయుడు 2 ఇంకా గేమ్ ఛేంజర్ ఒకేసారి చిత్రీకరించారు. భారతీయుడు 2 విషయానికి వస్తే ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు . ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులకి పట్టుకున్న భయం ఏంటి అంటే ఈ చిత్రం ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది అని. ఎందుకంటే, శంకర్ కి ఎప్పటినుంచో రచయితగా పనిచేస్తున్న రచయిత్రి మరణించిన తరువాత ఆయన తీసిన ఏ చిత్రం కూడా ప్రేక్షకుల మన్ననలు నోచుకోలేదు. రోబో తరువాత అంతటి విజయం ఏ చిత్రానికి కూడా దక్కలేదు.

ఇప్పుడు ఈ చిత్రం పరిస్థితి ఏంటి అని అందరి భయం. ఇది ఇలా ఉంటే ఎప్పుడో ఈ చిత్రం నుంచి “జాబిలమ్మ జాకెట్టు” అనే ఒక పాట విడుదల చేసిన ఈ చిత్రం ఇప్పుడు రెండొవ పాటని విడుదల చేసింది. అదే “రా మచ్చ మచ్చ”. ఒక పెద్ద ఈవెంట్ చేసి మరి విడుదల చేసారు. నకాష్ అజిజ్ ఆలపించిన ఈ పాటని, అనంత్ శ్రీరామ్ గారు రచించారు. గణేష్ ఆచార్య గారు కోరియోగ్రఫీ చేసిన ఈ పాట నెట్టింట మంచి వ్యూస్ తో ముందుకు సాగుతోంది. ఇలానే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వెళ్తే ఈ చిత్రం మీద మంచి ఒపీనియన్ తో ప్రేక్షకులు, సినిమా గెలుపు మీద ఒక నమ్మకంతో ఉంటారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page