హీరో శరత్ కుమార్ కూతురిగా కాకుండా విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్ఠానం ఏర్పరుచుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సెన్సేషన్ పాన్ ఇండియా సినిమా ‘శబరి’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రంన్నీ మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆరిస్టుగా, విల్లన్ గా అదరకొట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో మాత్రం లీడ్ రోల్లో ఒక సాధారణ వెల్ ఎడ్యుకేటెడ్ గృహిణిగా చక్కగా రాణించారు. ప్రపంచవ్యాప్తంగా మే 3న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం. ఇప్పుడు దసరా సందర్భంగా ఓట్ లో సందడి చేయనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ”కుటుంబం అంతా కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా ‘శబరి’. కథ, కథనాలు ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా. ముఖ్యంగా ఆమె నటన ‘వావ్’ అనేలా ఉంటుంది. ‘శబరి’ చిత్రం 300 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మే 3న విడుదలయి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంది. అక్టోబర్ 11న అన్ని భాషల్లో సన్ నెక్స్ట్ ఓటీటీ లో విడుదల చేయబోతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది” అని చెప్పారు.