- Advertisement -spot_img
HomeMoviesTollywood"గేమ్ ఛేంజర్‌" రిలీజ్ అప్డేట్ వచ్చేసిందోచ్!

“గేమ్ ఛేంజర్‌” రిలీజ్ అప్డేట్ వచ్చేసిందోచ్!

- Advertisement -spot_img

ఎట్టకేలకు మెగా అభిమానులంతా ఎన్నాళ్ళో వేచిన ఉదయం వచ్చేసింది. మూడేళ్ళుగా పరితపించిన “గేమ్ ఛేంజర్‌” రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. దసరా సందర్భంగా రామ్ చరణ్ అభిమానులని ఖుషి చేస్తూ “గేమ్ ఛేంజర్‌” రిలీజ్ డేట్ ప్రకటించేసింది మూవీ యూనిట్. జనవరి 10న వస్తున్నాము అంటూ మూడునెలల ముందే మెగా అభిమానులకి సంక్రాంతి తెచ్చేసింది. కాకపోతే ఒక్కటే నిరాశ క్రిస్టమస్ కి వస్తుందనుకున్న సినిమా సంక్రాంతి కి పోస్టుపోన్ అవ్వడం. పోస్టుపోన్ అయింది కేవలం రోజుల వ్యవధే కాబట్టి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు.

సంక్రాంతి పండగ రామ్ చరణ్ కి బాగా కలిసొచ్చిన పండగ గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్, ఎవడు వంటి చిత్రాలు సంక్రాంతి కే వచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులిపేసాయి. అందుకే ఈసారి గేమ్ ఛేంజర్‌ కూడా మళ్లీ సంక్రాంతికే వస్తుండడంతో రామ్ చరణ్ అభిమానుల ఆనందాలకి అవధలు లేకుండా పోయాయి. ఇప్పటికే “గేమ్ ఛేంజర్‌” నుంచి వచ్చి రెండు సాంగ్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.అటు శంకర్ సైతం గత కొన్ని ఎదురవుతున్న పరాజయాల్ని ఈ సినిమాతో చెక్ పెట్టాలని కసిగా పనిచేస్తున్నాడు. దీపావళికి టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది మూవీ యూనిట్. అయితే “గేమ్ ఛేంజర్‌” సంక్రాంతికి వస్తుండడంతో మెగాస్టార్ “విశ్వంభర” సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page