- Advertisement -spot_img
HomeMoviesTollywoodడిసెంబర్ 20న మోహనకృష్ణ ఇంద్రగంటి- ప్రియదర్శి కలయికలో కొత్త చిత్రం. పేరు "సారంగపాణి జాతకం"

డిసెంబర్ 20న మోహనకృష్ణ ఇంద్రగంటి- ప్రియదర్శి కలయికలో కొత్త చిత్రం. పేరు “సారంగపాణి జాతకం”

- Advertisement -spot_img

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ఆ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో “సారంగపాణి జాతకం” అనే ఒక కొత్త సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా నేడు వెల్లడించారు.

చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ”డిసెంబర్ 20న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. సెప్టెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ అంతా పూర్తి చేశాం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు సైతం తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసి క్రిస్మస్ సెలవుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం. ఇటీవల కొన్ని సన్నివేశాలు, ఫుల్ రష్ చూశా. నాకు ఎంతో సంతృప్తి కలిగింది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం మా ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటితో ఇంటిల్లిపాది నవ్వుకునే వినోదాత్మక తీస్తుండటం మాకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ‘సారంగపాణి జాతకం’ గుర్తుండిపోయే సినిమా అవుతుంది” అని చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page