2021 డిసెంబర్ 2న నందమూరి నటసింహం బాలయ్య సృష్టించిన ప్రకంపనలు అంతా, ఇంతా కాదు. కరోనా తర్వాత అసలు థియేటర్స్ కే రావడం మానేసిన ప్రేక్షకులని మళ్లీ థియేటర్స్ దగ్గర సందడి చేయించింది మాత్రం బాలయ్య “అఖండ” చిత్రమే. బోయపాటి- బాలయ్య హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం, బాలయ్య మాస్ కి శివయ్య రిఫరెన్స్ కూడా ఉండడంతో అప్పట్లో అఖండ థియేటర్స్ అన్ని శివ నామంతో మారుమోగిపోయాయి. అప్పటివరకు ప్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణ కెరీర్ కి “అఖండ” చిత్రం కోన ఊపిరి పోసింది. దాదాపు 100కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి అంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అఖండ -2 కి సంభందించిన లాంచింగ్ కార్యక్రమం నేడు గ్రాండ్ గా జరిగింది.
ఈ లాంచింగ్ ఈవెంట్లో అఖండ టీం అంతా . అఖండ లో హీరోయిన్ గా నటించిన ప్రగ్య జైస్వాల్ సీక్వెల్ లో కూడా కొనసాగుతుంది. అఖండ విజయంలో కీలకపాత్ర పోషించిన థమన్ ఇప్పుడు సీక్వెల్ కి కూడా తన డ్రమ్స్ ప్రతాపం చూపించడానికి సిద్ధమైయ్యాడు. లెజెండ్ వంటి గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన 14రీల్స్ బ్యానర్ రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర వాళ్ళు ఇప్పుడు మరోసారి బాలయ్య-బోయపాటి కాంబినేషన్ మూవీ తో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నారు. ఈ ఈవెంట్లో మూవీ యూనిట్ తో పాటు బాలకృష్ణ ఇద్దరు కూతుర్లు కూడా పాల్గొన్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేయగా బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో 14రీల్స్ వారితో పాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా తొలిసారి నిర్మాణ రంగంలోకి దిగుతున్నారు. అనంతరం బాలకృష్ణ ఒక అదిరిపోయే డైలాగ్ చెప్పి అదరకొట్టాడు. అఖండ చిత్రం తెలుగులో మాత్రమే తెరకెక్కించిన, అఖండ-2 ని మాత్రం “అఖండ తాండవం” పేరుతో పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు బోయపాటి.