రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
చిత్రం:ది డీల్
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: A super excited suspense Thriller “The Deal”
నటి నటులు: హను కోట్ల, చందన, ధరణి ప్రియా, రవి ప్రకాష్, రఘు కుంచె తదితరులు
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
మ్యూజిక్ డైరెక్టర్: RR ధ్రువన్
సినిమాటోగ్రఫీ: సురేంద్ర రెడ్డి
సమర్పణ: డాక్టర్ అనిత రావు
ప్రొడక్షన్: సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్
నిర్మాతలు: హెచ్. పద్మ రమాకాంత్ రావు, రామకృష్ణ కొలివి
రచన–దర్శకత్వం: డా.హను కోట్ల
ది డీల్ మూవీ రివ్యూ: The Deal Movie Review #FilmCombat
ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటుడు ‘హను కోట్ల’ హీరోగా, దర్శకుడి గా చేసిన చిత్రం ది డీల్. చందన, ధరణి ప్రియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనిత రావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నేడు శుక్రవారం (అక్టోబర్ 18) న విడుదలైంది. సో, అసలు కథలోకి వెళ్దాం.
కథ:
భైరవ(హనుకోట్ల) అలియాస్ ఆనంద్, లక్ష్మి(ధరణి ప్రియా) ఇద్దరు భార్య భర్తలుగా కలిసి ఉంటారు. ఒక యాక్సిడెంట్ లో కోమాలోకి వెళ్తాడు. కొన్ని నెలల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చిన గతం మర్చిపోతాడు. ఆ టైం లో లక్ష్మి(ధరణి ప్రియా) తన భార్యని కలవరిస్తుంటాడు. తన గతం తెలుసుకునే ప్రయత్నంలో, ఇందు(సాయి చందన) డిప్యూటీ మేనేజర్ ని చంపడానికి వచ్చిన మాదవ్(రవి ప్రకాష్) గ్యాంగ్ నుంచి కాపాడి మెల్లగా అమ్మాయి లవ్ లో పడతాడు. హాస్పటల్ లో భైరవ(హనుకోట్ల) అలియాస్ ఆనంద్ ని చూసి, లక్ష్మి(ధరణి ప్రియా) నా భర్త కాదు అని ఎలా చెప్పింది? అసలు వీళ్లిద్దరు నిజమైన భార్య భర్తలేనా కాదా? లక్ష్మి ఒకవేళ తన భార్య అయ్యితే ఇందు ని ఎందుకు లవ్ చేస్తాడు? అసలు రవి ప్రకాష్ గ్యాంగ్ ఎందుకు ఇందు ని చంపాలని అనుకుంటారు? మధ్యలో ఇందు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ అధినేత రావు(రఘు కుంచె) కథ ఏంటి? అనేది తెలియాలి అంటే మీరు సినిమా తప్పకుండ థియేటర్ లో చుడాలిసిందే…
విశ్లేషణ:
ది డీల్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఇందు అనే అమ్మాయిని హత్య చేసేందుకు రవి ప్రకాష్ గ్యాంగ్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో యాక్సిడెంట్, చంపడానికి ట్రై చేసిన ప్రతి సారి ప్రయత్నాలు ఫెయిల్ అవ్వటం, అనంతరం ట్విస్ట్స్ తో స్క్రీన్ ప్లే పరిగెడుతుంటుంది. ట్విస్ట్‌లతో సినిమా మొత్తం నడిపించడం అంటే మామూలు విషయం కాదు, ఈ సినిమా కి చక్కగా కుదిరింది. అక్కడక్కడ వచ్చే కొన్ని సెన్స్ కాస్త ల్యాగ్ అనిపించిన, కథ చుట్టూ అల్లుకున్న డ్రామా ఈ సినిమాలో హైలైట్. నటి నటులు పాపులర్ కాకపోయినప్పటికీ ‘ది డీల్’ సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుందని మా నమ్మకం.
నటి నటులు పెర్ఫామెన్స్:
హీరోయిన్ ‘చందన’ సినిమాలో ది బెస్ట్ కేరీర్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ధరణి ప్రియా చీర కట్టులో తెలుగింటితనం, తన ప్రెజెన్స్ సినిమాకి అసెట్ తో పాటు మంచి కీ రోల్ చేసారు. హీరో ‘హను కోట్ల’ తెరపైన చూసినంత సేపు చాలా కామ్ గా అటు కామిడి, ఇటు ఎమోషన్స్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసారు. రవి ప్రకాష్ విలన్ పాత్రలో అదరగొట్టేసాడు. రఘు కుంచె పాత్ర చిన్నదే అయ్యిన కనిపించినంత సేపు ప్రేక్షకులని ఆకట్టుకున్నారు, తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం:
స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉన్నప్పటికీ, డైలాగ్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకొని ఉంటే బాగుండేది. కానీ, సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఒక ట్రాన్స్ లోకి వెళ్తారు. ‘డైరెక్షన్’ స్కిల్స్ సూపర్బ్. ‘మ్యూజిక్ & బ్యాగ్రౌండ్’ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన బలం. ‘ఎడిటింగ్’ పని తీరు బాగుంది. ‘విజ్యువల్స్’ పరంగా ‘డిఓపి’ నిరాశే మిగిల్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓ మేరకు పర్వాలేదు.
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.