ఒక హీరో కి ఉన్న క్రేజ్ ప్రేక్షకులని థియేటర్స్ వరకు రప్పిస్తుంది.. ఇంకొందరు దర్శకుడిని నమ్మి థియేటర్ చేరుకుంటారు.. మరి స్టార్ హీరో నే స్వయంగా నిర్మాత గా మారి ఒక చిత్రం తన సొంత బ్యానర్ పై విడుదల చేస్తున్నారు అంటే ప్రేక్షకులు ఇంక ఆలోచిస్తారా చెప్పండి?? విలక్షణ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ సొంత బ్యానర్ “రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ” నిర్మాణం లో ఈ దీపావళికి మనముందుకు వస్తున్న చిత్రం ‘అమరన్ ‘. స్టార్ హీరోస్ మనకి తెర మీద దర్శనమిస్తే , ఆర్మీ లో పనిచేస్తూ మనల్ని సురక్షితంగా కాపాడే రియల్ లైఫ్ హీరోస్ ఎందరో.. మరి వారిలో ఒకరి కధే ‘అమరన్’.
శివ కార్తికేయ హీరో గా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా మన ముందుకి వస్తున్న ‘అమరన్’ ఇప్పటికే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. జీ వి ప్రకాష్ మ్యూజిక్ ఇప్పటికే అందరిని ఆకట్టుకుని ప్రతి రీల్స్ అండ్ వెడ్డింగ్ షూట్స్ లో బీ జీ ఎం గా వినిపిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ SHIVA AROOR రాసిన “India’s Most Fearless: True Stories of Modern Millitary Heroes” లో మేజర్ ముకుంద్ గురించి ప్రస్తావించిన సంఘటనలకి ఫిల్మీ ఎలిమెంట్స్ జోడించి ఎంతో అందంగా తెరపైకెక్కించారు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి.ఇక మన మలర్ ఈ చిత్రం లో మరోసారి మలయాళీ గా కనువిందు చేయనుంది.
“ఇందు రెబెక్కా వర్ గెస్” గా యూత్ అంతా మాట్లాడుకునే హాట్ టాపిక్ గా మారిన సాయి పల్లవి మరి లవర్ గర్ల్ గానే కాకుండా ఒక మేజర్ భార్య గా తను పడే ఆ ఎడబాటు ని “ఈ కడలి నింగికి మధ్యన ఉన్న దూరమే నాకు తనకి” అన్న ఫీల్ తెప్పించి ప్రేక్షకుల తో కంటతడిపెట్టిస్తుందా లేక ” I am proud of him being an army officer and me being an army wife “, అంటూ ఆర్మీ లో పని చేసే ప్రతి ఒక ఆఫీసర్ కుటుంబం గర్వపడేలా చేస్తూ మనకి వారి విలువ తెలియచేస్తుందా తెలియాలి అంటే రేపు ఫిలిం రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.. ప్రపంచం లో మనకి ఏమైనా అయితే ఎఫెక్ట్ అయ్యే ఒక కుటుంభం అందరికి ఉంటుంది , మరి మేజర్ ముకుంద్ వరదరాజన్ ఫామిలీ ఎలా ఎఫెక్ట్ అయ్యారు , అసలు జమ్మూ లో 2014 లో జరిగిన ఆ ఎటాక్ లో ఏం జరిగింది నేరుగా తేర పైన చూడాల్సిందే ఎందుకు అంటే ఈ రియల్ హీరోస్ కి మనం ఇచ్చే ఒక చిన్న నివాళి వారి గురించి, వారు మనకోసం చేసే ప్రాణత్యాగం గురించి తెలుసుకోడం.. Wishing team Amaran good luck 👍🏻