రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024
చిత్రం: “లక్కీ భాస్కర్”
రేటింగ్: 3.25/5
బాటమ్ లైన్: The Genius Behind Lucky Baskhar’s Success
నటి నటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, మానస చౌదరి, రిత్విక్, సాయి కుమార్, టిన్ను ఆనంద్, రాంకీ తదితరులు
ఎడిటర్: నవీన్ నూలి
మ్యూజిక్ డైరెక్టర్: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి
ప్రొడక్షన్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన–దర్శకత్వం: వెంకీ అట్లూరి
“లక్కీ భాస్కర్” మూవీ రివ్యూ: Lucky Baskhar Movie Review #FilmCombat
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “లక్కీ భాస్కర్(Lucky Baskhar)” చిత్రంతో అలరించడానికి మనముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి, దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేస్తున్న ఈ చిత్రానికి, ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రీలిజ్ అయ్యింది. సో, అసలు కథలో కి వెళ్దాం…
కథ:
1992 ముంబైలో ‘భాస్కర్'(దుల్కర్ సల్మాన్) ‘మగధ బ్యాంక్’ లో ఓ చిన్నపాటి క్యాషియర్ గా పని చేస్తాడు. ‘మోతిలాల్’ స్ట్రీట్ లో తన భార్య సుమతి(మీనాక్షి చౌదరి) మరియు తన ‘కుటుంబం’తో కలిసి చాలా కష్టంగా నివసిస్తూ ఉంటాడు. తన కుటుంబం కోసం ‘డబ్బు’ సంపాదించడం అనేది ఒక ‘అవసరం’ నుంచి ‘వ్యసనం’గా ఎలా మారింది? 6000/- ఉద్యోగానికి పని చేసే, ఒక క్యాషియర్ నుంచి అసిస్టెంట్ జెనరల్ మేనేజర్ తో పాటు కొన్ని వందల కోట్లు ఎలా సంపాదించగలిగాడు? డబ్బులు సంపాదించే క్రమంలో తను ఆడిన మైండ్ గేమ్ ఏంటి? డబ్బు వల్ల తను నష్టపోయాడా? లాభ పడ్డాడా? అనే ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.
విశ్లేషణ:
1992 స్కామ్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే! ఈ కథ తో ముడిపడి ఉన్న ఒక కామన్ మ్యాన్ భాస్కర్ కోణంలో ఉండే కధే ఈ “లక్కీ భాస్కర్” చిత్రం. ఆ సిరీస్ చుసిన చూడకపోయిన, ఈ లక్కీ భాస్కర్ మాత్రం చూడకుండా మిస్ అవ్వద్దు సుమీ.
ఈ చిత్రంలో ప్రతి సీన్ ఎంతో డీటైలింగ్ గా వెళ్తూ బ్యాంక్ టర్నినాలజీ గురించి అందరికి అర్ధమయేలా చెప్పిన తీరు బాగుంది. బ్యాంక్ లూప్ హొల్స్ పట్టుకొని ఒక కామన్ మ్యాన్ తన ఇంటిలిజెన్సీ ని ఉపయోగించి ఎలా ఓడిదుడుకులు ఎదురుకుంటూ ముందుకి కొనసాగిన విధానం సూపర్బ్. సినిమాలో వచ్చే డైలాగ్స్ కి ప్రేక్షకులు విజిల్స్ వేయాలిసిందే. సినిమాలో వచ్చే కొన్ని కీలకమైన సీన్స్ కి బ్రమ్మరథం పడతారు. ముఖ్యంగా, చిన్న పిల్లాడి బర్త్ డే పార్టీ సీన్, నగలు కొనే సీన్, కొన్ని బ్యాంక్ సీన్స్, క్లైమాక్స్ ట్విస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సినిమా లో ఇది బాగోలేదు అనే అంశం ఏది లేదు. కార్ లో గోవా కి వెళ్లే సీన్ కి ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటారు. డబ్బు తో ముడిపడిన కుటుంభం వేధింపులు సీన్ వేరే లెవెల్ భయ్యా.
ఇలాంటి మాస్టర్ పీస్ సినిమా గురించి చెప్పడం కన్నా థియేటర్ లో ఇంటిల్లి పాది సినిమా చుడాలిసిందే.
నటి నటులు పెర్ఫామెన్స్:
హీరో ‘దుల్కర్ సల్మాన్'(లక్కీ భాస్కర్) పాత్ర లో పరకాయ ప్రవేశం చేసి, సినిమా మొత్తం తన భుజాల మీద నడిపించాడు. ఎంతో ఇంటెన్సిటీ తో కలిగిన ఎమోషన్స్ ని చాలా చక్కగా పెర్ఫార్మ్ చేస్తూ కేరీర్ ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. హీరోయిన్ ‘మీనాక్షి చౌదరి'(సుమతి) పాత్ర లో మిడిల్ క్ల్యాస్ అమ్మాయిలా ఓదిగిపొయ్యి ప్రతి ఒక్క ఆడపడుచుని ఏడ్పించేలా చేసింది. మానస చౌదరి గెస్ట్ అప్పీరియన్స్ అయ్యినప్పటికీ తన సొగసైనా ఘాటు అందాలతో గుండెల్లో సెగలు పుట్టించింది. రిత్విక్, సాయి కుమార్, టిన్ను ఆనంద్ ‘కి’ రోల్ పోషించి సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం:
బలమైన స్టోరీ లైన్ తో పాటు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. సినిమా చూస్తున్నంత సేపు నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కలుగుతుంది. ‘డైరెక్షన్’ స్కిల్స్ చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకునేలా వావ్ అనిపించాడు. సినిమాకి మంచి ప్రసంశలు రావడం ఖాయం. ‘మ్యూజిక్ & బ్యాగ్రౌండ్’ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన బలం. ‘ఎడిటింగ్’ పని తీరు బాగుంది. ఒక రియలిస్టిక్ కంటెంట్ కి కావలిసిన ‘విజ్యువల్స్’, ఎంతో డిటైల్డ్ గా ‘డిఓపి’ అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ వేరే లెవెల్ అంతే.
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.