నటన అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు చాలా మంది నటులు మన ఇండస్ట్రీ లో ఉన్నారు. ఇండస్ట్రీ పరంగా ఫామిలీ సపోర్ట్ ఉన్నాకూడా ఆ అవకాశం ఉపయోగించుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా తన టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అందాల అప్సరస హిమజ. విజయవాడ లో పుట్టిన అచ్చతెలుగు అందం. తన కళ్ళే కోటి భావాలు పలుకుతాయి. తన తండ్రిగారు చంద్రశేఖర్‌రెడ్డి మాటలు, పాటలు రాసిన సాయి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన “సర్వాంతర్యామి” టెలిఫిల్మ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ధ్రువతార, తనకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుని అంచలంచలుగా ఎదుగుతూనే ఉన్నారు. అందంలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆవిడ చదువులో మేటి గానే ఉండేవాళ్ళు. సీరియల్స్ అవకాశాలు ఇంకా రానప్పుడు ఆవిడ HR గా కూడా పనిచేసారు.
ఆ చూపులో ఒక మత్తు ఉంటుంది. నటలో ఒక అనుభవజ్ఞులవలెనే మెళకువలు ఉంటాయి. అందానికి తగ్గ గాత్రం, మినీ అరుంధతి లాంటి నైజం. తన అందానికి తగ్గట్టుగానే పాత్రలు కూడా తనని వెతుక్కుంటూ వచ్చాయి. 2013 లో బుల్లితెరమీద అరంగేట్రం చేసారు హిమజ. “స్వయంవరం” అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులకి పరిచయం అయ్యారు ఈ ముద్దుగుమ్మ. తరువాతి సంవత్సరమే “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” అనే ఇంకో సీరియల్ లో అవకాశం కొల్లగొట్టారు. ఆ సీరియల్ చేస్తుండగానే సినిమా అవకాశాలు కూడా తలుపుతట్టాయి. రామ్ పోతినేని, రాశిఖన్నా చిత్రం శివమ్ లో రాశిఖన్నా స్నేహితురాలిగా నటించి మెప్పించారు. అప్పటినుంచి వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో కూడా తన సత్తా చాటారు ఆవిడ. ఈరోజు ఈ అందాలబొమ్మ పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు ఎల్లప్పుడూ జరుపుకోవాలని అందరం కోరుకుందాం. తన అందానికి, టాలెంట్ కి తగ్గ అవకాశాలు వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.