Bubblegum Movie: ‘బోల్డ్ సీన్స్’ కథకి అవసరం కాబట్టే ఆ క్యారెక్టర్ చేశాను: మానస చౌదరి

0
258

ట్యాలెంటెడ్ డైరెక్టర్ ‘రవికాంత్ పేరేపు’ దర్శకత్వంలో ‘రోషన్ కనకాల’ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. ‘మానస చౌదరి’ హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ ‘మానస చౌదరి’ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

IMG 7783 Bubblegum, Bubblegum Movie, Maanasa Choudhary, Ravikanth Perepu, Roshan Kanakala

‘మానస చౌదరి’ ఒక తెలుగింటి అమ్మాయి. తన తల్లి తండ్రుల ప్రోత్సాహంతో టీనేజ్ లోనే మోడలింగ్ కేరీర్ ఎంచుకుంది. మోడలింగ్ రాణిస్తూనే, సినీ ఇండ్రస్ట్రీ వైపు అడుగు పెట్టింది. హీరోయిన్ గా వచ్చిన అవకాశాన్ని వదలకుండా ‘ఈమోజీ’ వెబ్-సిరీస్ తో తమిళంలో తెరగేంట్రం చేసింది. ఆ తరువాత సరైన అవకాశాలు రాకపోయినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా, సరైన కథ కోసం ఎదురు చూస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరపై ‘బబుల్‌గమ్’తో ఒక డ్రగ్ ఎడిక్ట్ లా టీనేజ్ కురాళ్ళ గుండెల్లో పాతుకుపోయింది.

‘మానస చౌదరి’, ప్రొఫైల్ చుసిన మొదటి క్షణంలోనే డైరెక్టర్ ‘రవికాంత్ పేరేపు’ ఆడిషన్ చేయకుండా ఇలాంటి అమ్మాయినే నా కథ కోరుకుంటుంది అని హీరోయిన్ గా తీసుకున్నారట. హీరో సుమ గారి అబ్బాయి అంటే, థ్రిల్ అయ్యాను. నాకు సుమ అంటే చాలా ఇష్టం & రెస్పెక్ట్ కూడా. అలాగే, నా చిన్నప్పుడు ‘క్షణం’ మూవీ నా ఫ్యావరెట్. ఇలాంటి సాలిడ్ టీమ్ తో కలిసి పని చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.

IMG 7735 Bubblegum, Bubblegum Movie, Maanasa Choudhary, Ravikanth Perepu, Roshan Kanakala

‘జాహ్నవి’ సినిమాలో ఒక ‘ఫ్యాషన్ డిజైనర్’. బబుల్‌గమ్ స్టోరీ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ప్రతి ఒక్క టీనేజర్స్ కి నచ్చే సినిమా. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కథకి అవసరం కాబట్టే, నేను ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. పైగా, నాకు 23 సంవత్సరాలు నేను కథ విన్నాక నచ్చి ఓప్పుకున్నా. నాకు & రోషన్ కి మధ్య కెమిస్ట్రీ చూసే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కరంగా అనిపించదు. పైగా, రొమాన్స్ అందరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా తరువాత నాకు అన్ని రకాల రోల్స్ వస్తాయని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఈ రోల్ చేసినందుకు నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. గతంలో నేను ‘ఇమోజీ’ తమిళ్ ప్రాజెక్ట్ కి ‘బబుల్‌గమ్’ సినిమాకి యాక్టింగ్ పరంగా చాలా నేర్చుకున్నాను.

IMG 7841 Bubblegum, Bubblegum Movie, Maanasa Choudhary, Ravikanth Perepu, Roshan Kanakala

బబుల్‌గమ్ లో ఛాలెంజింగ్ అంటే; ఎక్కువ ఇంటిమేట్ సీన్స్ ఉండటం వల్ల డిఫరెంట్ యాంగిల్స్ లో తీస్తుంటారు. సో, ఆ టైమ్ లో కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది.

నా దృష్టిలో లవ్ అంటే: లవ్ తో పాటు రెస్పెక్ట్ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇచ్చి పుచ్చుకోవడం.

IMG 7696 Bubblegum, Bubblegum Movie, Maanasa Choudhary, Ravikanth Perepu, Roshan Kanakala

బబుల్‌గమ్ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ముందుగానే రిహార్సల్స్ చేసుకొని సెట్ కి వెళ్ళటం వళ్ళ ఎక్కువ టెక్ లు తీసుకోకుండా హెల్ప్ అయ్యింది. హీరో రోషన్ ఎన్నో విధాలుగా తనకి సపోర్ట్ ఇవ్వటం నా అదృష్టం. షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరు నన్ను బాగా చూసుకుంటారు, అందరం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయాం. తమిళ్ ఇండస్ట్రీ కన్నా తెలుగులో నన్ను అందరు ఆదరిస్తున్నారు.

నేను ఇండస్ట్రీ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫెస్ చేయలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే, నేను చాలా లక్కీ. అందరు నన్ను చాలా అందంగా ఉన్నావ్ అంటుంటారు. అందంతో పాటు, టాలెంట్ కూడా ఉంది అని గుర్తిస్తే చాలు అని కోరుకుంటా!!

నేను ఇప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను. ఎలాంటి జానర్ చేయాలో నాకు తెలియదు. ఎందుకంటే, ఒక యాక్టర్ గా అన్ని రకాల రోల్స్ చేయాలనీ నా కోరిక. లైక్…ఓ బేబీ, గూఢచారి, వింటేజ్ మూవీస్, తప్పడ్ ఇలాంటి మూవీస్ చేయాలనీ కోరిక. బబుల్‌గమ్ సినిమా ట్రైలర్ & టీజర్ వచ్చాక హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి, త్వరలోనే అనౌన్స్ చేస్తాను. మేము సినిమా ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు యూత్ కి బాగా ట్రైలర్ నచ్చింది. అందరికి నచ్చి చాలా ఓన్ చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here