చక్రవ్యూహం(ది ట్రాప్) మూవీ రివ్యూ
చిత్రం: చక్రవ్యూహం(ది ట్రాప్)
నటి నటులు: అజయ్, జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రగ్యా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సురేష్, ప్రియా, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి, రాజ్ తిరందాసు, రవితేజ, మోహన్ తదితరులు.
ఎడిటర్: జెస్విన్ ప్రభు
సంగీతం: భరత్ మంచిరాజు
ఛాయాగ్రహణం: జి వి అజయ్ కుమార్
నిర్మాత: వెంకటేష్ & అనూష
మూవీ బ్యానర్: సహస్ర క్రియేషన్స్
రచన, దర్శకత్వం: చెట్కూరి మధుసూధన్
విడుదల తేదీ: 02.06.2023
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘అజయ్’. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ‘అజయ్’ ప్రధాన పాత్రదారుడిగా పోషించిన చిత్రం “చక్రవ్యూహం’ – ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘చెట్కూరి మధుసూధన్’ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్ ప్రేక్షకులని నుండి అనుహ్య స్పందన లభిస్తుంది. జూన్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ: ‘సంజయ్'(వివేక్ త్రివేది) & ‘సిరి’(ఊర్వశి పరదేశి) ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటారు. వీళ్ళిద్దరి ప్రేమ తెలిసిన ‘సంజయ్’ ఫ్రెండ్ ‘శరత్’ దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకి ఊర్వశి పరదేశి(సిరి) చనిపోతుంది. ‘సిరి’ కేస్ ని సిఐ సత్య (‘అజయ్’/పోలీస్ ఆఫీసర్) డీల్ చేస్తాడు. ఆ కేస్ ని చేధించే ప్రయత్నంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు అజయ్. కాకపోతే, ఆ ప్రయత్నంలో అనుకోని సంఘటనలు, ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయి. అసలు, సిరి ని ఎవ్వరు చంపారు? ఎందుకు చంపారు? దేనికోసం చంపారు? ఈ కుట్ర లో సంజయ్, శరత్ ల హస్తం ఉందా? సిఐ సత్య (అజయ్/పోలీస్ ఆఫీసర్) ఎదుర్కొన్న సంఘటనలు ట్విస్ట్ లు ఏంటి? అనేది తెలుసుకోవాలి అంటే మీరు సినిమా తప్పకుండ థియేటర్ లో చుడాలిసిందే?
కథనం, విశ్లేషణ: ‘సంజయ్'(వివేక్ త్రివేది) & ‘సిరి’(ఊర్వశి పరదేశి) ఇద్దరు భార్య భర్తలు. ఒక రోజు తమ 50క్రోర్స్ ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీకి ఇద్దరు అటెండ్ అవ్వాలని అనుకుంటారు. కాకపోతే, సిరి కి తల మత్తు గా ఉండటంతో సంజయ్ ఒక్కడే పార్టీకి వెళ్ళాలిసి వస్తుంది. పార్టీ నుంచి ఇంటికి వచ్చే సరికి భార్య చనిపోతుంది. అసలు కథ ఇక్కడ నుంచి మొదలు అవ్వుతుంది. అప్పుడే, పోలీస్ ఆఫీసర్ అజయ్ ఆ మర్డర్ కేస్ ని సాల్వ్ చేయడానికి ఎంటర్ అవ్వుతాడు. సినిమాలో అజయ్ నటింపచేసిన సన్నివేశాలు సినిమాకి ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ లో కాస్త ల్యాగ్ అనిపించిన సస్పెన్సడ్ గా సాగింది. సిరి డెడ్ బాడీ పట్టుకొని హీరో సంజయ్(వివేక్ త్రివేది) నటించిన తీరు సూపర్బ్. పోలీస్ ఆఫీసర్ అజయ్ ప్రతి ఒక్కరి కోణంలో ఆలోచించి సిరి ని ఎవ్వరు చంపారు అనేది? విజ్యువల్ గా చూపించిన తీరు బాగుంది. దర్శకుడు కథ పరంగా సక్సెస్ అయ్యిన కాస్టింగ్ లో కొంత శ్రద్ద వహించి ఉంటె సినిమా నెస్ట్ లెవెల్ ఉండేది. ఏదైమైనా సినిమా ప్రతి ఒక్కరు తప్పకుండ థియేటర్ లో చుడాలిసిన సినిమా.
నటి నటులు పెర్ఫామెన్స్: ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తున్న ‘అజయ్’ ఈ సినిమాతో మరింత ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ప్రతి సీన్స్ లో ఎంతో చక్కగా కథని మోస్తూ, నటనని మెప్పించడంలో పోటా పోటీ పడిన విధానం అద్భుతం. ‘ఊర్వశి పరదేశి’ యాక్టింగ్ తెర మీద పెర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకుంది. జ్ఞానేశ్వరి(దుర్గ) పాత్రలో ఓదిగిపోయింది. ‘ప్రగ్యా నయన్’, వివేక్ త్రివేది కథ కి ఎంతో కీలకం, ఇద్దరు తమ పాత్రలకి న్యాయం చేసారు. శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సురేష్, ప్రియా, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘చెట్కూరి మధుసూధన్’ కథ ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడి ఊహా గానానికి నెస్ట్ లెవల్ కి తీసుకెళ్తాయి. జెస్విన్ ప్రభు ‘ఎడిటింగ్’ వర్క్ శ్రద్ద తీసుకుంటూనే క్రిస్పీ గా తీర్చిదిద్దారు. ‘భరత్ మంచిరాజు’ అందించిన మ్యూజిక్ ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారు. జి వి అజయ్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తీసిపోకుండా రిచ్ గా ఉన్నాయి.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: ఆకట్టుకుంటున్న ‘చక్రవ్యూహం’
#Ajay #Gnaneswari #vivektrivedi #urvashipardeshi #pragyanayan #shubalekhasudhakar #rajeevkanakala #suresh #priya #srikanth #iyyangar #kireeti #rajtirandasu #raviteja #mohan