- Advertisement -spot_img
HomeUncategorizedCustody: మొదటి 20 నిమిషాలు మరియు ఇంటర్వెల్ బ్లాస్ట్..||Thrilling and Heart-Pumping: Experience the Action-packed...

Custody: మొదటి 20 నిమిషాలు మరియు ఇంటర్వెల్ బ్లాస్ట్..||Thrilling and Heart-Pumping: Experience the Action-packed First 20 Minutes and Interval Scene of Custody.

- Advertisement -spot_img

Custody: మొదటి 20 నిమిషాలు మరియు ఇంటర్వెల్ బ్లాస్ట్..లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘Custody’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై పవన్‌ కుమార్‌ సమర్పిస్తుండగా, శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ & ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో Custody ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

నాగ చైతన్య కి Custody కథ వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు ఎక్సయిట్ మెంట్ ఇచ్చిందట. ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు కూడా అదే ఎక్సయిట్ మెంట్ అని చెప్తున్నాడు హీరో. తమిళంలో ఎన్నో హిట్లు ఇచ్చిన వెంకట్ ప్రభు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని అలరించడానికి ప్రేక్షకులు స్వాగతం పలుకుతున్నారు. నా కెరీర్ లో మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ ఇది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.

Custody
Custody

Custody చిత్రంతో కృతి శెట్టి కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని హీరో కాంప్లిమెంట్ ఇవ్వగా, అబ్బూరి రవి పవర్ ఫుల్ డైలాగ్స్ హైలైట్ కానున్నాయట. అరవింద్ స్వామి కథ కి ఓకే చేయడంతో అందరికీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందట. శరత్ కుమార్ & నాగ చైతన్య కి చాలా యూనిక్ యాక్షన్ డిజైన్ ఉండబోతుందట. ప్రియమణి పాత్రకు మంచి ఎలివేషన్ ఉండబోతుందని చెప్తున్నారు.

ఇళయరాజా గారు, యువన్ శంకర్ రాజా గారి సంగీతం బ్లాక్ బస్టర్. థియేటర్ లో ఒక మ్యాజిక్ చూపిస్తారు. సినిమా మొదటి ఇరవై నిమిషాలు మరియు ఇంటర్వెల్ బ్లాస్ట్ అవ్వుతుందని టీం సభ్యులు చెప్తున్నారు. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ లు వుంటాయి. మీరు కొత్త చై ని చూడబోతున్నారు.

వెంకట్ ప్రభు మాట్లాడుతూ Custody లో స్టైల్,యాక్షన్, ఫెర్ ఫార్మెన్స్ , సెంటిమెంట్, మాస్ ఇలా అన్నీ వున్నాయి. Custody నా కెరీర్ లో భారీ చిత్రం. నన్ను బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని ఓమ్ము చేయను. ఇది శివ రాజు ల కథ. శరత్ కుమార్, సంపత్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో నటించిన, పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ప్రీ రీలిజ్ ఫంక్షన్ లో దర్శకుడు మాట్లాడుతూ Custody 2 ఉంటుందని హిట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అయ్యిపోయారు.

కృతి శెట్టి మాట్లాడుతూ Custody ట్రైలర్ కి ఇచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. ట్రైలర్ ఇంత నచ్చిందంటే సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. వెంకట్ ప్రభు గారు రేవతి లాంటి మంచి పాత్రని ఇచ్చారు. నాగ చైతన్య నా ఫేవరట్. నా బంగార్రాజు ..ఇప్పుడు నా శివ( నవ్వుతూ). నా జీవితంలో స్ఫూర్తి నిచ్చే వ్యక్తుల్లో చైతన్య ఒకరు. శివ తన డ్యూటీ కోసం ఫైట్ చేస్తాడు. రేవతి తన ప్రేమ కోసం ఫైట్ చేస్తుంది .

ప్రియమణి మాట్లాడుతూ నాగ చైతన్యతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. కృతి అద్భుతమైన నటి.

అబ్బూరి రవి మాట్లాడుతూ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది త్రివిక్రమ్. ‘వీడు అబ్బూరి రవి మాటల రచయిత’ అని పరిచయం చేసింది మాత్రం నాగేశ్వర రావు గారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాగార్జున గారికి ఊపిరి రాశాను. చైతన్య ఎప్పుడూ అభిమానుల ప్రేమ Custodyలో ఉంటారు. ఆయన సినిమాకి రాయడం చాలా అనందంగా వుంది.

అక్కినేని నాగ చైతన్య ‘Custody’ రెండు భాషలలో రూపొందిన చిత్రం, Custody, మే 12, 2023న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధం అయ్యింది. విడుదలకు ముందు, మేకర్స్ గత రాత్రి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈవెంట్ సందర్భంగా, దర్శకుడు వెంకట్ ప్రభు తాను పూర్తిగా తెలుగులోనే మాట్లాడతానని, బహుశా Custody 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కాబట్టి, కస్టడీకి సీక్వెల్ డెవలప్మెంట్ లో ఉందని అతను ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పాడు. ఈ ప్రకటన అభిమానులకు ఆసక్తిని కలిగించింది.

Custody అనేది ఒక పోలీసు యాక్షన్ డ్రామా, ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు, ఇందులో ప్రియమణి మరియు అరవింద్ స్వామి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చారు.

అరవింద్ స్వామి 2016లో ధృవతో చాలా కాలం తర్వాత టాలీవుడ్‌కి తిరిగి వచ్చి చేసిన ప్రతి సినిమాలో తనదైన ముద్రను వేసుకుంటూ పోతున్నారు. సిద్ధార్థ్ అభిమన్యు పాత్రలో అరవింద్ స్వామి అద్భుతంగా నటించాడు. ఇప్పుడు మళ్ళీ, 6-7 సంవత్సరాల విరామం తర్వాత, అతను ఈ వారం విడుదల కానున్న నాగ చైతన్య చిత్రం Custody కీలక పాత్రలో నటించాడు.

అరవింద్ స్వామి నటుడిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సాధారణంగా ఎగ్జైటింగ్ పాత్రలు పోషిస్తున్నాడు. కాబట్టి Custodyలో అతనే ట్రంప్ కార్డ్‌గా మారే అవకాశం ఉందని ఆశలు ఉన్నాయి. ఈ సినిమాలో సైకో కిల్లర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అరవింద్ స్వామి కూడా తెలుగు సినిమాలలో రెగ్యులర్ గా కనిపించడు, తెలుగు ప్రేక్షకులు ప్రతి వారం చూసే సాధారణ నటులలో అతను ఉండదు.

తద్వారా Custodyకి కొంత తాజాదనం వస్తుంది. దర్శకుడు వెంకట్ ప్రభు గత చిత్రం మానాడు గొప్ప విజయం సాధించినట్లే, నాగ చైతన్య Custody కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని మరియు Custody కూడా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా మారాలని ఆశిద్దాం.

Tags: Custody, Film Combat, filmcombat

Links:

Trailor : https://youtu.be/oiNHSwGX5yI, https://youtu.be/jMMaZXXfwjI

You may like:

ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ గా శ్రీలీలా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ సినిమా ప్రారంభం

Allari Naresh | Ugram | దర్శకుడు విజయ్ కనకమేడల యాక్షన్-ప్యాక్డ్ ‘ఉగ్రం’లో అల్లరి నరేష్ విశ్వరూపం – సినిమా వివరాల్లోకి వెళ్తే..

AnniManchiSakunamule : MalvikaNair || తన రాబోయే చిత్రం ‘అన్ని మంచి శకునములే’ గురించి మాళవిక నాయర్ మాటల్లో..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page