మండు వేసవిలో ఆకట్టుకుంటున్న ‘గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌’ అభిమానులు

0
99

#GlobalStarRamCharan: గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్‌ ఫాన్స్ మండుతున్న ఎండల్లో చేసిన చల్లటి కార్యక్రమం స్ప్హూర్తివంతంగా ఉంది.

ముంబై అంధేరి, భీవండి, జుహూలోని శంకర్‌ ఆలయం పరిసరాల్లో పలుచోట్ల దాదాపు 1000 మంది రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ బాటిల్స్ ప్రజలకి అందించి వేసవి తాపాన్ని తీర్చారు. తమ ఆరాధించే నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందిన అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

#GlobalStarRamCharan ‘గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌’ సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆయన గ్రేస్‌ సగటు ప్రేక్షకుడికి ఎలా గుర్తుకొస్తుందో, ప్రజల క్షేమం కోసం ఆయన చేసే సేవలు కూడా ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంటాయి. అలాగే, అసోసియేషన్లు, ఎన్జీఓలు, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్‌ సంద్రభాలలో పలు రకాలుగా సహాయాలు అందించారు. ఇవన్నీ ప్రత్యక్షంగా గమనిస్తున్న అభిమానులు సమాజానికి హితోధికంగా సాయపడాలని ముందుకొచ్చారు.

తమ స్టార్‌ లాగానే తాము కూడా సమాజం పట్ల బాధ్యతతో ఉంటామని, దయ, కరుణతో వ్యవహరిస్తామని, నలుగురికి స్ఫూర్తి పంచాలన్న ధ్యేయంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ప్రజలకు మజ్జిగ పంచడం అనేది ఆలోచనకు ఒక రూపం మాత్రమేనని అన్నారు.

సమాజంలో సాటి వ్యక్తుల పట్ల సానుకూల దృక్పథం పెరగాలంటే, కచ్చితంగా తమవంతు సాయాన్ని ప్రతి ఒక్కరూ చేయాలనే ఉద్దేశాన్ని పంచుకున్నారు. ఈ నెల 6న ముంబైలోనూ, ఏప్రిల్‌ 29న షోలాపూర్‌లోనూ ఈ మజ్జిక పంపిణీ & అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. హార్ట్ వార్మింగ్‌ అని సవినయంగా చెబుతున్నారు చరణ్‌ సైన్యం.

Tags: #GlobalStarRamCharan #RamCharan #ManOfMassesRamCharan #filmcombat #Filmcombat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here