మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ రివ్యూ: Maruthi Nagar Subramanyam Movie Review #FilmCombat

0
166

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

చిత్రం: మారుతీ నగర్ సుబ్రమణ్యం
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: సినిమా సక్సెస్ కి….అన్ని ‘అర్హతలు’ ఉన్న మారుతీనగర్ సుబ్రమణ్యం🔥
నటి నటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు

ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి
సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల
సమర్పణ: తబితా సుకుమార్
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య

రావురమేష్, ఇంద్రజ జంటగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇందులో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య, అతని సరసన రమ్య పసుపులేటి నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఈ చిత్రం ఆగస్టు 23న థియేటర్ లో విడుదలవుతున్న సందర్భంగా, ముందు రోజు ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు ప్రీమియర్ షో నిర్వహించారు.

IMG 7486 Ankith Koyya, Harsha Vardhan, Indraja, Maruthi Nagar Subramanyam, Maruthi Nagar Subramanyam Movie Review, Ramya Pasupuleti, Rao Ramesh

కథ:
సుబ్రమణ్యం(రావ్ రమేష్) గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనీ బాగా చదివి జాబ్స్ కి అప్లై చేస్తాడు.
ఈ లోపల కళామణి(ఇంద్రజ)ని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంతలోనే భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం రావటం, ఇంటిని పోషిస్తూ పిల్లోడిని కనటం జరిగిపోతుంది. అయ్యితే కొన్ని కారణాలు వల్ల సుబ్రమణ్యంకి ఉద్యోగం రాదు. ఎప్పటికైనా ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే చేస్తాను అని మొండి పట్టు పడతాడు. చేతిలో డబ్బులు లేక అప్పులు చేసి, తన సొంత డబ్బుతో కట్టాలి అనుకున్న ఇల్లు కూడా మధ్యలో ఆపేయడంతో 25 ఇయర్స్ కాలం గడిచిపోతుంది. అయ్యితే ఒక రోజు సుబ్రమణ్యం అకౌంట్ లోకి 10ల్యాక్స్ పడతాయి. ఆ 10ల్యాక్స్ ఎవ్వరు వేశారు? ఎందుకు వేశారు? ఆ అమౌంట్ ని సుబ్రమణ్యం ఖర్చు పెట్టాడా లేదా? ఒకవేళ ఖర్చు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అసలు మారుతి నగర్ అని పేరు ఎందుకు వచ్చింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా సినిమా చుడాలిసిందే?

విశ్లేషణ:
డైరెక్టర్ కుటుంభంలో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసిన చిత్రం…”మారుతీ నగర్ సుబ్రమణ్యం”.

సినిమా మొదట్లో ఒక పది నిమిషాలు కాస్త మెల్లగా స్టార్ట్ అయ్యినప్పటికీ, ఉండే కొద్దీ గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంది. హీరో & హీరోయిన్ ఇద్దరి మధ్య సాగే లవ్ సీన్స్ రియల్ స్టిక్ గా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ ఎబ్బెట్టు గా కూడా అనిపిస్తాయి. సినిమాలో కామెడీ సీక్వెన్స్, డైలాగ్స్ సినిమాకి ప్రధాన బలం & హై లైట్స్.

ముఖ్యంగా….మొదటి చూపులోనే నచ్చావు అని పేరెంట్స్ ముందు చెప్పే సీన్…. OLX సీన్….లక్ష వడ్డీ కట్టే సీన్…అబ్బో ఇలాంటివి చాలా ఉన్నాయి! పైగా, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది.

సెకండ్ హాఫ్ రోలర్ కోస్టర్ లా…స్క్రీన్ ప్లే పరిగెడుతుంది. థియేటర్ లో సగటు ఆడియెన్ ని అద్భుతమైన సీన్స్ తో టెన్షన్ పెట్టిస్తుంది. ప్రి క్లైమాక్స్ & క్లైమాక్స్ ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లతో కడుపుబ్బా నవ్విస్తారు. ఓవర్ ఆల్ గా సినిమా సూపర్బ్. తప్పకుండ ప్రతి ఒక్కరు కుటుంభ సమేతంగా చుడాలిసిన సినిమా…..

IMG 7482 Ankith Koyya, Harsha Vardhan, Indraja, Maruthi Nagar Subramanyam, Maruthi Nagar Subramanyam Movie Review, Ramya Pasupuleti, Rao Ramesh

నటి నటులు పెర్ఫామెన్స్:
తెలుగు ప్రేక్షకులకి సుపరిచుతుడైన ఏకైక వెర్సిటైల్ నటుడు రావ్ రమేష్….సుబ్రమణ్యం పాత్రలో శివ తాండవం లా పరకాయ ప్రవేశం చేసి నటనలో విజృభించారు. నేను అల్లు అరవింద్ చిన్న కొడుకుని అని చెప్పుకునే తిరిగే అర్జున్(అంకిత్ కొయ్య) ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రని పోషించి నటనలో ఔరా అనిపించాడు. ఇకపోతే అందాల భామ అప్సరస కాంచన(‘రమ్య పసుపులేటి’) క్యారెక్టర్ లో ఉన్న ఇన్నోసెన్స్ ని అవలీల గా ప్రదర్శిస్తూ….. కవ్విస్తూ నవ్విస్తుంది. ఇంద్రజ, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు…..తమ పరిధి మేరకు బాగా రాణించారు.

సాంకేతిక విభాగం:
డైరెక్టర్ ‘లక్ష్మణ్ కార్య’ కథ ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. కొన్ని సన్నివేశాలలో ఎమోషనల్ సీన్స్ ని కూడా కామిక్ వేలో కడుపుబ్బా నవ్వించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. క్లైమాక్స్ లో రావ్ రమేష్ పాత్రకి ఇచ్చిన BGM హైలెట్ గా నిలుస్తుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఓ మేరకు పర్వాలేదు.

గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here