మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ: Mr. Bachchan Movie Review #FilmCombat

0
214

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

చిత్రం: మిస్టర్ బచ్చన్
విడుదల తేదీ: 14.08.2023
రేటింగ్: 2.25/5
బాటమ్ లైన్: బచ్చన్ బోరు…తగ్గింది జోరు…

నటి నటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సత్య, సత్యం రాజేష్, బాబు మోహన్, షకలక శంకర్, అన్నపూర్ణ తదితరులు.

ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అయనంక బోస్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్
మూవీ బ్యానర్: ఎ కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్ & గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్
స్క్రీన్ ప్లే రచయితలు: రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, ప్రవీణ్ వర్మ, దత్తాత్రేయ, తన్వి కేసరి
దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్

IMG 6604 1 Babu Mohan, Comedian Sathya, Jagapathi Babu, Mass Maharaja Raviteja, peoples media factory, ravi teja, TG Vishwa Prasad, vivek kuchibotla

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా నూతన నటి భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కానున్న సంద్రభంగా చిత్ర యూనిట్ ముందు రోజు ప్రెస్ షో నిర్వహించారు. ఇక ఎందుకు ఆలస్యం కథ లోకి వెల్దాము…..

కథ:
‘మిస్టర్ బచ్చన్'(రవితేజ) ఒక సిన్సియర్ ‘ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్’. పేరు ప్రఖ్యాతలు ఉన్న అధికారులని మట్టి కరిపించి ‘ట్రాక్ రికార్డ్’ సంపాదించిన వ్యక్తి. అయ్యితే ఒక రైడ్ కేస్ లో సస్పెండ్ అవ్వుతారు. దాంతో, ఇంటి దగ్గర తన టీమ్ తో కలిసి పెళ్ళిళ్ళకి ‘ఆర్కెస్ట్రా’ పాటలు పాడతాడు. ఆ సంధ్రభంలో ‘జిక్కి'(భాగ్యశ్రీ బోర్సే)తో లవ్ లో పడి, పెళ్ళికి దారి తీస్తుంది. ‘మిస్టర్ బచ్చన్'(రవితేజ) మరల డ్యూటీ లో జాయిన్ అయ్యి, ‘ముత్యం జగ్గయ్య’ అనబడే ఒక ప్రముఖ వ్యక్తి మీద ఎలా రైడ్ చేస్తాడు? రైడ్ చేయడం వళ్ళ తన పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి? ఆపదలో ఉన్న ‘మిస్టర్ బచ్చన్’ ని ఎవ్వరు కాపాడారు? ముత్యం జగ్గయ్య ఎలాంటి సవాళ్లు విసిరాడు? చివరికి ఇద్దరిలో ఎవ్వరు గెలిచారు? అనేది తెలియాలి అంటే, మీరు తప్పకుండ థియేటర్ లో సినిమా చుడాలిసిందే…

IMG 6239 1 Babu Mohan, Comedian Sathya, Jagapathi Babu, Mass Maharaja Raviteja, peoples media factory, ravi teja, TG Vishwa Prasad, vivek kuchibotla

విశ్లేషణ:
సినిమా ఓపినింగ్ హీరో ఇంట్రో…… ఫైట్ తో మొదలై ఉద్యోగం సస్పెన్షన్ దాకా దారి తీస్తుంది. అయ్యితే, ఈ మధ్యలో హీరో రవితేజ పెళ్లి చూపులు సీన్ బాగుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా, డైలాగ్స్ కొద్దో గొప్పో బాగుండేది.

చచ్చేవాడి పేరు తప్ప, చంపినా వాడి పేరు రాలేదు…….
బుల్లెట్ ఒక్కడికే తెగుద్ది….భయం అందరికి తాకుద్ది……
24 క్యారెట్ గోల్డ్ తెలుసు….24 క్యారెక్టర్ ఇప్పుడే చూస్తున్నా……డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి….

హీరో & హీరోయిన్ మధ్య సాగే సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయి. అక్కడక్కడ వచ్చే సత్య కామిడి ఓ మేరకు పర్వాలేదు. సినిమాలో హీరోయిన్ వేసిన ప్రతి కాస్ట్యూమ్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాయి. ఇంటర్వెల్ లో ముత్యం సాంబశివ రావ్ తో సాగే సీన్ తేలిపోతుంది. ఆ తరువాత వచ్చే కంటిన్యుషన్ సీన్ కి పే ఆఫ్ చేయకపోవటం..జగపతి బాబు ఇంట్లో జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ రసవత్తంగా ఉంటుంది అనిపించే లోపల ఆడియెన్స్ నిరాశకి గురవ్వుతారు. షకలక శంకర్ తో సాగే కామిడి సీన్స్ పండకపోవటం….సినిమా మొత్తం మీద అనవసరమైన లవ్ ట్రాక్స్ & ఫైట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్క్రీన్ ప్లే లో లోపాలు కనిపిస్తుంటాయి…..ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. ఓవర్ ఆల్ గా సినిమా ఒకసారి చూద్దాం అనుకునే వాళ్ళు చూడచ్చు……చూసాక ఎందుకు ఆ ఒక్క సారి కూడా చూసాం అని అనుకోవచ్చు……సినిమా చూసాక మీ అభిప్రాయం చెప్పండి…..

నటీనటులు పెర్ఫామెన్స్:
మాస్ మాహారాజ్ రవితేజ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మునపటి లాగే తనదైన స్టైల్ లో అదరకొట్టారు. ఇకపోతే, మిస్టర్ బచ్చన్ మూవీ తో ఎంట్రీ ఇచ్చిన టాలీవూడ్ యాపిల్ జిక్కి(‘భాగ్యశ్రీ బోర్సే’) అటు గ్లామర్ తో, ఇటు నడుము ఓంపుల డ్యాన్స్ తో కుర్రకారుల గుండెల్లో చిచ్చు రేపింది. కానీ, యాక్టింగ్ లో కాస్త వెనకబడింది. జగపతి బాబు(ముత్యం జగ్గయ్య) గా ఆకట్టుకున్నప్పటికీ క్యారెక్టర్ లో దమ్ము లేకపోవడంతో తేలిపోయారు. దొరబాబు(సత్య) తన కామిడి టైమింగ్ తో అక్కడక్కడా శబాష్ అనిపించుకున్నారు. తదితరులు తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు బాగానే రాణించారు.

సాంకేతిక విభాగం:
డైరెక్టర్ ‘హరీష్ శంకర్’ ఎంచుకున్న లైన్ బాగుంది. కానీ, తెర మీద స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఎగ్జ్ క్యూషన్ ఫెయిల్ అయ్యింది. సినిమాలో వచ్చే ఏ సన్నివేశం కూడా పండకపోవడం యాదృచ్చికం. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. మిక్కీ జె మేయర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ, సాంగ్స్ అన్నిపెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ స్టెప్స్ అండ్ గ్లామర్ తో పాటు హుక్ లైన్స్ కి మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఎడిటింగ్ లో అక్కడక్కడా జంప్ కట్స్ ఉన్నప్పటికీ ఓ మేరకు పరవాలేదు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపించాయి.

గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here