వధువు ఎవరు డార్లింగ్ ?

0
124

డార్లింగ్ ప్రభాస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. శత్రువుకైనా ఇంటికి పిలిచి మరి భోజనం పెట్టె నైజాం ప్రభాస్ సొంతం. ప్రభాస్ తన జీవితంలో ఇప్పటికే ఏంటోమందికి పిలిచి మరి భోజనం పెట్టాడు. కానీ ప్రభాస్ ఎంతమందికి భోజనం పెట్టిన ఎన్ని సార్లు పెట్టిన తన అభిమానులు తృప్తి చెందేది మాత్రం పెళ్లి భోజనం పెట్టినప్పుడే. జమానా కాలం నుంచి ప్రభాస్ కుటుంబసభ్యులు కంటే అభిమానులే ఎక్కువ ఎదురుచూస్తున్నారు ప్రభాస్ పెళ్లి పిలుపు కోసం. ప్రతి సినిమా ఫంక్షన్ లో ప్రభాస్ కి కామన్ గా ఎదురయ్యే ప్రశ్న పెళ్లి ఎప్పుడని. ప్రతిసారి ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటాడు. కుటుంబసభ్యులేమో అప్పుడు, ఇప్పుడు అంటూ అభిమానులని ఊరిస్తూనే ఉంటారు. ఐతే బాహుబలి తర్వాత చేసుకుంటాడేమో అని ఆశగా ఎదురుచుసిన ఫాన్స్ కి నిరాశే మిగిలింది.

ss10 Film Combat, filmcombat, Prabhas, Telugu movie, telugu movie review

బాహుబలి సినిమా తర్వాత “సాహో”, “రాధేశ్యామ్”, “ఆదిపురుష”, “సలార్” ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తుండడంతో ఇంకా పెళ్లి చేసుకోదేమోనని ప్రభాస్ ఫాన్స్ సైతం ఫిక్సయిపోయారు. అయితే నీరుగారిపోయిన వారి ఆశలు కి మళ్లీ జీవంపోస్తూ ఈరోజు ప్రభాస్ తన పెళ్లి గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు. “డార్లింగ్స్ మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తున్నారు” అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పెట్టాడు. అయితే ఇది తన పెళ్లి గురించా లేక ఏదయినా సినిమా గురించా అని మాత్రం క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రభాస్ నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉంటే అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకొకటి ఉండదు. పైనున్న కృష్ణంరాజు గారి ఆత్మ శాంతించినట్లే.

rs 1 Film Combat, filmcombat, Prabhas, Telugu movie, telugu movie review

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here