నేను 18 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి రోల్ చేశా. క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ ఉంటుంది ~ రమ్య పసుపులేటి ఇంటర్వ్యూ

0
34

రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇందులో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య, అతని సరసన రమ్య పసుపులేటి నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రమ్య పసుపులేటి మీడియాతో మాట్లాడారు. ఆవిడ చెప్పిన విశేషాలు… 

రమ్య గారు… మీ గురించి చెప్పండి!
నాకు నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి యాడ్స్ చేస్తున్నాను. అనుష్క గారి ‘పంచాక్షరీ’లో బాలనటిగా చేశా. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ‘స్పైడర్’లోనూ ఓ రోల్ చేశా. ఆ తర్వాత చదువుకోవాలని గ్యాప్ తీసుకున్నాను. బ్యాచిలర్స్ ఫినిష్ చేసి సినిమాల్లోకి వచ్చాను. ప్రజలకు రీచ్ అవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్‌ హెల్ప్ అయ్యింది.

‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’లో మీకు అవకాశం ఎలా వచ్చింది?
దర్శకుడు లక్ష్మణ్ కార్య గారు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశారట. ఈ అమ్మాయిని పిలవండి, ఆడిషన్ చేద్దామని టీమ్ మెంబర్లతో చెప్పారట. ఆఫీసుకు వెళ్లాక ఆడిషన్ చేశారు. నా పెర్ఫార్మన్స్ నచ్చడంతో ఎంపిక చేశారు. చాలా రోజుల తర్వాత మంచి అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యాను.

b1516db2 ffbc 4ce9 9f84 e5e773e705c6 Ankith Koyya, Maruthi Nagar Subramanyam, Ramya Pasupuleti, Rao Ramesh, Sukumar Writings

కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?
నవ్వించడం కష్టం. ప్రేక్షకుల్ని నవ్వించగలిగితే క్యారెక్టర్ పండినట్టు. ఇందులో నా పాత్ర ద్వారా నవ్వించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన వాళ్లు అందరికీ నా రోల్ నచ్చుతుంది. 

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ట్రైలర్ చూస్తే గ్లామర్, ట్రెడిషనల్… రెండు విధాలుగా కనిపిస్తున్నారు!
‘మేడమ్ సార్ మేడమ్’ సాంగ్ చూస్తే… నన్ను అన్ని విధాలుగా చూపించారు. నేను 18 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి రోల్ చేశా. క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ ఉంటుంది. గ్లామర్, ట్రెడిషనల్… రెండు విధాలుగా కనిపిస్తా.

మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
బబ్లీ, క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయి. కొంచెం తింగరితనం ఉంటుంది. కానీ, చాలా నవ్విస్తా. నాకు కామెడీ చేయడం చాలా ఇష్టం. ఎమోషన్స్ కూడా బాగా చేస్తా.

IMG 7337 Ankith Koyya, Maruthi Nagar Subramanyam, Ramya Pasupuleti, Rao Ramesh, Sukumar Writings

అంకిత్ కొయ్యతో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్?
వెరీ అమేజింగ్ కో యాక్టర్. వ్యక్తిగతంగా మనిషికి హెల్ప్ చేసే పర్సనాలిటీ. నటుడిగా ఎలా చేస్తాడో ‘ఆయ్’లో చూశాం. వండర్ ఫుల్ యాక్టర్. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా బావుంటాయి. 

‘మేడమ్ సార్ మేడమ్’ పాటకు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఊహించారా?
అవును… ముందు ఊహించాను. మా దర్శకుడు లక్ష్మణ్ కార్య ట్యూన్ వినిపించారు. పాట వినిపించమంటే… విడుదల అయ్యే ముందు రోజు వరకు చూపించలేదు. ఆ పాట ట్యూన్ విన్నప్పుడు నచ్చింది. సిద్ శ్రీరామ్ పాడుతున్నారని తెలిశాక పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను.

రావు రమేష్, ఇంద్రజ వంటి సీనియర్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది?
మొదట భయం వేసింది. నేను కంఫర్టబుల్‌గా ఉండేలా వాళ్ళు చూసుకున్నారు. ఓ రోజు సీన్ అయ్యాక రావు రమేష్ గారు ‘బాగా చేశావమ్మా’ అన్నారు. ఆ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంద్రజ గారు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు. ఆవిడ చాలా ప్రెట్టిగా ఉంటారు. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here