శివం భజే మూవీ రివ్యూ: Shivam Bhaje Movie Review

0
241

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

చిత్రం: శివం భజే
విడుదల తేదీ: 1.ఆగస్ట్.2024
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: ఇంట్రస్టింగ్ డివైన్ కల్ట్ సినిమా

నటీనటులు: అశ్విన్ బాబు, దిగంగన
సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, తులసి
శివమణి, మురళీ శర్మ, సాయి ధీనా, బ్రహ్మాజీ, ఇనయ సుల్తాన్, తనికెళ్ళ భరణి
ఎడిటర్: చోటా కే ప్రసాద్
డీఓపి: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకుడు: వికాస్ బడిస
ప్రొడ్యూజర్: మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకుడు: అబ్దుల్ అప్సర్ హుస్సేన్

గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు పెరిగాయి. ఇక, ఈ రోజు సినిమా విడుదల సందర్భంగా మన “ఫిల్మ్ కాంబాట్” రివ్యూ చూద్దాం!

IMG 6508 Apsar, Arbaaz Khan, Ashwin Babu, Digangana Suryavanshi, Director Apsar, Hyper Aadi, Maheswara Reddy Mooli, Shivam Bhaje, Shivam Bhaje Movie Review

కథ: అశ్విన్ బాబు(చందు) ఒక EMI రికవ్వరి ఏజెంట్. రికవ్వరి చేస్తున్న టైంలో, దిగంగన సూర్యవంశీ(శైలజ) ప్రేమలో పడతాడు. ఒక రోజు స్ట్రీట్ రౌడీస్ తో గొడవ పడి EMI రికవ్వరి చేయమని చెప్తాడు. ఒక పక్క సిటీ లో హత్యలు వరుసగా జరుగుతుంటాయి. అవి కనిపెట్టడానికి అర్బాజ్ ఖాన్(ACP మురళి క్రైం బ్రాంచ్) ప్రయత్నిస్తుంటాడు. అశ్విన్ తో గొడవ పడిన వ్యక్తులు మళ్ళి వచ్చి గొడవపడడంతో తన కళ్ళు పోగుట్టుకొవడం, డాక్టర్స్ కొత్త కళ్ళని రీప్లేస్ చేస్తారు. ఆపరేషన్ తరువాత అశ్విన్ లో మార్పు వస్తుంది. అసలు ఆ మార్పు ఏంటి? తన కళ్ళు ఎందుకు బ్లూ ఇష్ గా మారాయి? డోగ్రా కి కళ్ళకి సంబంధం ఏంటి? తనకి సంబంధం లేని అంశాలు ఎందుకు పదే పదే మెదులుతున్నాయి? తను ఎంతగానో ఆరాధించే శివుడు తనకి ఏం చెప్పాలి అనుకుంటున్నాడు? అసలు, అర్బాజ్ ఖాన్ & అశ్విన్ కి సంబంధం ఏంటి? ఆ మర్డర్స్ వెనకాల ఎవ్వరు ఉన్నారు? అనేది తెలియాలి అంటే, ఖచ్చితంగా మీరు సినిమా థియేటర్ లో చుడాలిసిందే!

IMG 6510 jpeg Apsar, Arbaaz Khan, Ashwin Babu, Digangana Suryavanshi, Director Apsar, Hyper Aadi, Maheswara Reddy Mooli, Shivam Bhaje, Shivam Bhaje Movie Review

విశ్లేషణ: హిడింబ సినిమా తరువాత హీరో అశ్విన్ బాబు కొత్త యూనిక్ పాయింట్‌తో వచ్చిన చిత్రం ”శివం భజే”.
ఈ సినిమాలో శాస్త్రీయ పాయింట్ తో పాటు, డివైన్ పాయింట్ ని జోడించి ఫ్యామిలీ కధాంశంతో తెరకెక్కించిన విధానం బాగుంది.

హిడింబలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ, ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే టైపులో ఉండే పాత్ర. అలాంటి పాత్ర చుట్టూ రాసుకున్న కథని ట్విస్ట్ లతో డైరెక్టెర్ అప్సర్ సక్సెస్ అయ్యారు. హీరో కి పలానా ప్రాబ్లమ్ జరగబోతుంది అని తెలుస్తున్నప్పటికీ సాల్వ్ చేయలేకపోతుంటాడు.

IMG 6514 Apsar, Arbaaz Khan, Ashwin Babu, Digangana Suryavanshi, Director Apsar, Hyper Aadi, Maheswara Reddy Mooli, Shivam Bhaje, Shivam Bhaje Movie Review

డోగ్రా కోసం తన ఫ్రెండ్స్ అందరు వచ్చి హీరో ని కాపాడే సన్నివేశం చూస్తే థియేటర్ లో తప్పకుండా విజిల్ వెయ్యాలిసిందే! క్లైమాక్స్ ఫైట్ తో సాగే శివుడు విశ్వరూపం కి గూస్ బంప్స్ వస్తాయి.

నటి నటుల పెర్ఫామెన్స్:
హీరో అశ్విన్ బాబు సినిమాలో ప్రధానమైన పాత్ర పోషించి చాలా మెచ్యూర్డ్‌ & స్టైలీష్ యాక్షన్ చేస్తూనే కథ ని ముందుకి నడిపించిన విధానం సూపర్బ్. హైపర్ ఆది, బ్రమ్మాజి తన పాత్ర లో పరకాయ ప్రవేశం చేస్తూనే కడుపుబ్బా నవ్వించారు.

IMG 6512 Apsar, Arbaaz Khan, Ashwin Babu, Digangana Suryavanshi, Director Apsar, Hyper Aadi, Maheswara Reddy Mooli, Shivam Bhaje, Shivam Bhaje Movie Review

మురళీ శర్మ నిడివి తక్కువే అయ్యినప్పటికీ పాత్రలో ఎంతో ఇంటెన్సిటీ క్రియేట్ చేసారు. దిగంగన సూర్యవంశీ, తులసి, ఇనయ సుల్తాన్ తమ పాత్ర మేరకు బాగా రాణించారు. ఇకపోతే, అర్బాజ్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఓదిగిపొయ్యి సినిమాలో ‘కి’ రోల్ పోషించారు.

సాంకేతిక విభాగం:
డైరెక్టర్ ‘అప్సర్’ కథ ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. కొన్ని సన్నివేశాలలో ఎమోషనల్ గా తెరకెక్కించడం తో పాటు ఫైట్స్ ఎగ్జైక్యూషన్ లో కూడా సక్సెస్ అయ్యారు.

IMG 6515 Apsar, Arbaaz Khan, Ashwin Babu, Digangana Suryavanshi, Director Apsar, Hyper Aadi, Maheswara Reddy Mooli, Shivam Bhaje, Shivam Bhaje Movie Review

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. క్లైమాక్స్ లో శివుడు పాత్రకి ఇచ్చిన BGM హైలెట్ గా నిలుస్తుంది. ఎడిటింగ్ పనితీరు బాగుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here